Balakrishna And Vishwak Sen: యూత్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది'(E Nagaraniki Emaindi). విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ చిత్రం ద్వారానే ఇండస్ట్రీ కి పరిచయం ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే . అప్పట్లో ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద అద్భుతాలు సృష్టించలేదు. కానీ ఓటీటీ లో విడుదల అయ్యాక కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని తెచ్చుకుంది. మనకి టైం పాస్ అయ్యేందుకు ఇప్పటికీ ఎదో ఒక సమయంలో ఈ సినిమాని ఓటీటీ లో చూస్తుంటాము. ఈ సినిమాని చూసినప్పుడల్లా మనం మన దోస్తులతో కలిసి తిరిగిన మధుర క్షణాలు, వాళ్ళతో చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. 2023 వ సంవత్సరం లో సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.
Also Read: మరోసారి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దిల్ రాజు సోదరుడు క్షమాపణలు..సంచలనం రేపుతున్న వీడియో!
మొదటి రిలీజ్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే, రీ రిలీజ్ లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా అనే చెప్పాలి. మొదటి రిలీజ్ లో ఈ చిత్రానికి దాదాపుగా 5 నుండి 6 కోట్ల రూపాయిలు వచ్చాయి. కానీ రీ రిలీజ్ లో మొదటి రోజే నాలుగు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చిత్రానికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా రోజుల నుండి సీక్వెల్ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని టాక్. ఆయన క్యారక్టర్ సుమారుగా 15 నిమిషాల వరకు ఉంటుందట.
కేవలం బాలయ్య మాత్రమే కాకుండా మరో టాప్ స్టార్ కూడా ఈ సినిమాలో నటించేంత స్కోప్ పెట్టాడట డైరెక్టర్. అవి ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. బాలయ్య బాబు కి నేటి తరం హీరోలతో మంచి ర్యాపో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశ్వక్ సేన్ తో బాలయ్య చాలా క్లోజ్ గా ఉంటాడు. విశ్వక్ సేన్ తో కలిసి సరదాగా పార్టీలు చేసుకుంటూ బాలయ్య గడిపిన రోజులు కూడా ఉన్నాయి. విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్ ని తెచ్చిపెట్టడానికి కారణం అయ్యింది. ఇక యూత్ ఆడియన్స్ సపోర్టు ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రం లో ఏకంగా ప్రత్యేక పాత్రనే పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.