Homeఎంటర్టైన్మెంట్Dil Raju: అన్నంత పని చేసిన దిల్ రాజు... చిరంజీవి, బాలకృష్ణలకు సంక్రాంతి షాక్!

Dil Raju: అన్నంత పని చేసిన దిల్ రాజు… చిరంజీవి, బాలకృష్ణలకు సంక్రాంతి షాక్!

Dil Raju: టాలీవుడ్ ని దిల్ రాజు శాసిస్తున్నారు. సినిమా బిజినెస్ వ్యవస్థ తన చేతుల్లో పెట్టుకొని అందరినీ కంట్రోల్ చేస్తున్నాడనే ఆరోపణ వినిపిస్తుంది. డబ్బింగ్ మూవీ వారసుడు నిర్మాతగా ఉన్న దిల్ రాజు అధిక డిమాండ్ ఉన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దెబ్బతీసేందుకు ట్రై చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలు దిల్ రాజు ఖండించారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరుకుతాయి, నా మీద కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ దిల్ రాజు వివరణ ఇచ్చారు. సినిమా బిజినెస్ ఎవరూ కంట్రోల్ చేయలేరు. బాగున్నా సినిమాను జనాలు ఆదరిస్తారు.. అంటూ నీతులు చెప్పారు.

Dil Raju
Dil Raju

తీరా చూస్తే పరిశ్రమ వర్గాల ఆరోపణలే నిజమయ్యాయి. వారసుడు చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్స్ కేటాయించి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మొండిచేయి చూపించారు. సంక్రాంతి చిత్రాల విడుదలకు సమయం దగ్గరబడిన నేపథ్యంలో థియేటర్స్ పంపకాలు మొదలయ్యాయి. చాలావరకు ఎగ్జిబిటర్లు తమ థియేటర్స్ లో ప్రదర్శించే చిత్రాల లిస్ట్ విడుదల చేశారు. ఏపీలో ప్రధాన నగరాల్లో ఒకటి, ఉత్తరాంధ్ర హార్ట్ అయిన వైజాగ్ థియేటర్స్ లో ఆడే సంక్రాంతి చిత్రాల లిస్ట్ విడుదల చేశారు.

అత్యధికంగా 8 స్క్రీన్స్ వారసుడు చిత్రానికి చెరో 5 స్క్రీన్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు దక్కాయి. వైజాగ్ లో అత్యధిక రెవెన్యూ ఇచ్చే సింగిల్ స్క్రీన్స్ సంగం, మెలోడీ వారసుడు ఖాతాలోకి పోయాయి. జగదాంబ, శరత్ మాత్రం వాల్తేరు వీరయ్యకు దక్కాయి. కేవలం లీలా మహల్ వంటి చెప్పుకోదగ్గ ఒక్క థియేటర్ వీరసింహారెడ్డి చేజిక్కించుకుంది. డిస్ట్రిబ్యూషన్ రేషియో పరిశీలిస్తే… వారసుడుకి సగం మిగతా రెండు చిత్రాలకు సగం థియేటర్స్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేషియోలో థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండనుంది.

Dil Raju
Dil Raju

చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ స్ట్రెయిట్ చిత్రాలను పక్కన పెట్టి వారసుడు చిత్రానికి అత్యధిక థియేటర్స్ కేటాయిస్తున్నారు. చిరంజీవైనా బాలకృష్ణ అయినా… దిల్ రాజు తలచుకుంటే కిందే అని ఈ పరిణామం రుజువు చేస్తుంది. తనను కాదని సొంతగా తమ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బతీయాలన్న దిల్ రాజు పన్నాగం అమలవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ కోల్పోతాయి. సినిమా చూడాలకున్నప్పటికీ ప్రేక్షకులకు టికెట్స్ దొరకవు. ఆ ఓవర్ ఫ్లో వారసుడు చిత్రానికి షిఫ్ట్ చేసి దిల్ రాజు లాభపడే సూచనలు ఉన్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version