Dil Raju: టాలీవుడ్ ని దిల్ రాజు శాసిస్తున్నారు. సినిమా బిజినెస్ వ్యవస్థ తన చేతుల్లో పెట్టుకొని అందరినీ కంట్రోల్ చేస్తున్నాడనే ఆరోపణ వినిపిస్తుంది. డబ్బింగ్ మూవీ వారసుడు నిర్మాతగా ఉన్న దిల్ రాజు అధిక డిమాండ్ ఉన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దెబ్బతీసేందుకు ట్రై చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలు దిల్ రాజు ఖండించారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరుకుతాయి, నా మీద కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ దిల్ రాజు వివరణ ఇచ్చారు. సినిమా బిజినెస్ ఎవరూ కంట్రోల్ చేయలేరు. బాగున్నా సినిమాను జనాలు ఆదరిస్తారు.. అంటూ నీతులు చెప్పారు.

తీరా చూస్తే పరిశ్రమ వర్గాల ఆరోపణలే నిజమయ్యాయి. వారసుడు చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్స్ కేటాయించి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మొండిచేయి చూపించారు. సంక్రాంతి చిత్రాల విడుదలకు సమయం దగ్గరబడిన నేపథ్యంలో థియేటర్స్ పంపకాలు మొదలయ్యాయి. చాలావరకు ఎగ్జిబిటర్లు తమ థియేటర్స్ లో ప్రదర్శించే చిత్రాల లిస్ట్ విడుదల చేశారు. ఏపీలో ప్రధాన నగరాల్లో ఒకటి, ఉత్తరాంధ్ర హార్ట్ అయిన వైజాగ్ థియేటర్స్ లో ఆడే సంక్రాంతి చిత్రాల లిస్ట్ విడుదల చేశారు.
అత్యధికంగా 8 స్క్రీన్స్ వారసుడు చిత్రానికి చెరో 5 స్క్రీన్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు దక్కాయి. వైజాగ్ లో అత్యధిక రెవెన్యూ ఇచ్చే సింగిల్ స్క్రీన్స్ సంగం, మెలోడీ వారసుడు ఖాతాలోకి పోయాయి. జగదాంబ, శరత్ మాత్రం వాల్తేరు వీరయ్యకు దక్కాయి. కేవలం లీలా మహల్ వంటి చెప్పుకోదగ్గ ఒక్క థియేటర్ వీరసింహారెడ్డి చేజిక్కించుకుంది. డిస్ట్రిబ్యూషన్ రేషియో పరిశీలిస్తే… వారసుడుకి సగం మిగతా రెండు చిత్రాలకు సగం థియేటర్స్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేషియోలో థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండనుంది.

చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ స్ట్రెయిట్ చిత్రాలను పక్కన పెట్టి వారసుడు చిత్రానికి అత్యధిక థియేటర్స్ కేటాయిస్తున్నారు. చిరంజీవైనా బాలకృష్ణ అయినా… దిల్ రాజు తలచుకుంటే కిందే అని ఈ పరిణామం రుజువు చేస్తుంది. తనను కాదని సొంతగా తమ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బతీయాలన్న దిల్ రాజు పన్నాగం అమలవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ కోల్పోతాయి. సినిమా చూడాలకున్నప్పటికీ ప్రేక్షకులకు టికెట్స్ దొరకవు. ఆ ఓవర్ ఫ్లో వారసుడు చిత్రానికి షిఫ్ట్ చేసి దిల్ రాజు లాభపడే సూచనలు ఉన్నాయి.