Anchor Suma: సుమ ఇటీవల యాంకరింగ్ నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ఒక స్పెషల్ ఈవెంట్ రూపొందించారు. బుల్లితెర కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ అందరూ సదరు షోలో పాల్గొన్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఏళ్ల తరబడి యాంకర్ గా ఎంటర్టైన్ చేసిన సుమ గారిని సన్మానించుకుందాం… అని హైపర్ ఆది అన్నారు. ఆమెకు పూలగుచ్చం ఇచ్చి శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. నేను మలయాళీ అమ్మాయిని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు ఆడియన్స్ ప్రేమాభిమానాలే కారణం అన్నారు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా యాంకరింగ్ కి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా నేను కుటుంబంతో గడపలేకపోతున్నాను. అసలు తినడానికి, పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళుతున్నట్లు నా జీవితం ఉంది. భర్త, పిల్లలతో ఆనందంగా గడిపే తీరిక, సమయం లేకుండా పోతుంది. నా ఫ్యామిలీని నేను బాగా మిస్ అవుతున్నాను. అందుకే కొన్నాళ్ల పాటు బుల్లితెరకు దూరం అవుతున్నాను… అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె అంత ఎమోషనల్ గా చెప్పగానే నిజమే అనుకున్నారు.
కట్ చేస్తే ‘సుమ అడ్డా’ అని కొత్త షోతో దిగిపోయింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆమెతో సరికొత్త టాక్ షో ప్రారంభించినట్లు తెలుస్తుంది. అలీ-పోసాని, శేఖర్ మాస్టర్-జానీ మాస్టర్ తో పాటు కళ్యాణం కమనీయం టీమ్ ఆమె షోలో పాల్గొన్నారు. సుమ తన మార్క్ ఎనర్జీతో షోను పరుగులు పెట్టించారని అర్థం అవుతుంది. అయితే సుమ యాంకరింగ్ నుండి విరామం తీసుకుంటున్నాను, కొన్నాళ్ళు బుల్లితెరపై కనిపించను అనగానే… అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. మేడం మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎప్పటికీ మీరు బుల్లితెరపై మాటల జలపాతంలా గలగలా పారాలి అని కోరుకున్నారు.

వాళ్ళ ఏడుపుకు, ఎమోషన్ కి సుమ విలువ లేకుండా చేసింది. బ్రేక్ అని చెప్పి కొత్త షో స్టార్ట్ చేసింది. సుమ తీరుకు అందరూ నివ్వెరపోయారు. సుమ ఇచ్చిన షాక్ తర్వాత బుల్లితెర షోలలో చేసే వాగ్దానాలు నమ్మకూడదని జనాలు ఫిక్స్ అయ్యారు. కేవలం ఆ ఎపిపోడ్ కి హైప్ తేవడం కోసం ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తారు? జనాలను తప్పుదోవబట్టిస్తారని క్లారిటీ వచ్చింది. ఇకపై ఈ టీవీ జనాల ఎమోషన్స్ కి మనం కనెక్ట్ కాకూడదని ఫిక్స్ అయ్యారు.