https://oktelugu.com/

Dil Raju : దిల్ రాజు గొప్ప మనసు.. గేమ్ చేంజర్ బాధిత కుటుంబాలపై కీలక నిర్ణయం…

తెలుగులో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కారణం ఏదైనా కూడా వాళ్ళంటే అభిమానులు పది చచ్చిపోతు ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 6, 2025 / 01:40 PM IST

    Dil Raju

    Follow us on

    Dil Raju : తెలుగులో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కారణం ఏదైనా కూడా వాళ్ళంటే అభిమానులు పది చచ్చిపోతు ఉంటారు. ఇక ఇది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు… మరి ఇది ఏమైనా కూడా ఆయన హీరో గా నాయకుడిగా రెండు బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగడం విశేషం…

    రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ మేకర్స్ కూడా సినిమా మీద హైప్ ని బాగా పెంచుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజమండ్రిలో చాలా ఘనంగా నిర్వహించారు. నిజానికి ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ప్రేక్షకులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి ఎవరైతే ఈవెంట్ కి వచ్చారో వాళ్ళందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళండి అని ఒకటికి పది సార్లు చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ఈవెంట్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమం లో ఒక ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు…

    ఇక ఏదైతే జరగకూడదు అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారో అదే జరిగింది అంటూ రీసెంట్ గా దిల్ రాజు ఒక వీడియో అయితే చేశారు. ఇక ఆ చనిపోయిన ఇద్దరి కుటుంబాలకి తను ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా నిలుస్తానని ఇమీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీ లకు 5 లక్షలు పంపిస్తానని చెప్పడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఒకే ఒక్క కారణం తో ఆయన ఏ ఈవెంట్లకి పెద్దగా హాజరు కావడం లేదు…అలాగే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఫ్యాన్స్ కి ఏదైనా ప్రమాదం జరగవచ్చనే ఉద్దేశంతోనే ఆయన ఎక్కువగా ఈవెంట్స్ కైతే రాడు అందువల్లే కొంతమందికి పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి రాడు అతనికి పొగరు అని అనుకుంటూ ఉంటారు.

    కానీ అతను అభిమానుల శ్రేయస్సు కోరుకుంటూ ఉండేవాడు కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడం అనేది కొంతవరకు ఆ ఫ్యామిలీలకి ఉపశమనాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…