Brahmaji: మూడు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడు బ్రహ్మాజీ. ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా కూడా చేశాడు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు. బ్రహ్మాజీకి ఒక కుమారుడు. అతన్ని హీరోగా కూడా పరిచయం చేశాడు. కానీ బ్రేక్ రాలేదు. కాగా బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పలు విషయాలపై స్పందిస్తారు. బ్రహ్మాజీ పోస్ట్స్ పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేసినట్లు ఉంటాయి. తాజాగా బ్రహ్మాజీ బౌన్సర్లను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.
ఎక్కడ చూసినా బౌన్సర్లు… వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు. పబ్లిక్ లో అంటే ఓకే.. మరీ సెట్స్ లో కూడానా… అని కామెంట్ చేశాడు. బ్రహ్మాజీ బౌన్సర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడని క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే ఎవరి బౌన్సర్లు? ఎక్కడ ఓవర్ యాక్షన్ చేశారు? అనేది తెలియాలి. బ్రహ్మాజీ రేంజ్ కి అయితే బౌన్సర్లు అవసరం లేదు. ఎవరో స్టార్ హీరో బౌన్సర్ల వలన బ్రహ్మాజీ ఇబ్బందులు పడ్డారా? అనే సందేహం కలుగుతుంది.
కాగా ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హీరోల వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లు పబ్లిక్ కి హానీ కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించి సమస్యలకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్ర ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోగా… నియమాలు, నిబంధనలు వెల్లడించి పంపారు. ఈ మీటింగులో బౌన్సర్ల ప్రస్తావన కూడా వచ్చింది. బౌన్సర్స్ తీరుపై తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ అయ్యింది. కొన్ని ప్రమాదాలకు బౌన్సర్లు కారణం అని నమ్ముతున్నారు. స్టార్ హీరోల బౌన్సర్ల టాపిక్ చర్చకు దారి తీసిన నేపథ్యంలో బ్రహ్మాజీ పోస్ట్, ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బ్రహ్మాజీకి పరిశ్రమలో గట్టి సంబంధాలు ఉన్నాయి. ఆయన పలువురు స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలు మైంటైన్ చేస్తున్నాడు. పెద్దవారిని ఆయన టార్గెట్ చేసిన సందర్భం లేదు.