Anantha Sriram : సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమా రంగంపై ఘాటైన విమర్శలు చేశారు. హిందూ ధర్మాన్ని సినిమా రంగం కళంకం కలిగిస్తుందని వస్తున్నా విషయంపై నేను బహటం గానే అంగీకరిస్తున్నాను అని చెప్పడమే కాకుండా సినిమా పరిశ్రమ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను అని అనంత శ్రీరామ్ తెలిపారు. పురాణాల వక్రీకరణ ద్వారా హిందూ ధర్మంపై సినిమాల ద్వారా దాడి జరుగుతుందని, వ్యాసభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. సినిమాలలోని పాత్రలలో, పాటలలో హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే చాలా సినిమాలలో చాలా ఏళ్లుగా కర్ణుడి పాత్రకు గొప్పదనం ఆపాదిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి 2898 సినిమాలో కర్ణుడి పాత్రను గొప్పవాడిగా చూపారని తెలిపారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ అగ్ని దేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే, సూర్యదేవుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడిని వీరుడు అంటే ఒప్పుకుంటామా అంటూ నిలదీశారు. యుద్ధంలో నెగ్గేది ధర్మమా లేదా ధనుస్సా అంటూ అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. ఇప్పటివరకు సినిమాలలో రామాయణం పై కూడా ఎన్నో వక్రీకరణలు వచ్చాయని, ఇంకా ఎన్నాళ్ళని ఇలాంటి వక్రీకరణలను ఊరుకుంటామని ఆయన ప్రశ్నించారు. దమ్ మారో దమ్ అనే పాటలో హరే కృష్ణ హరే రామ్ అనే నినాదాన్ని వాడారని, ఈ విధంగా హిందూ ధర్మాన్ని హసనం చేసే సినిమాలను అందరూ తిరస్కరించాలని అనంత శ్రీరామ్ తెలిపారు.
బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా మనం తిరస్కరిస్తే అటువంటి సినిమాలకు డబ్బులు రావని, డబ్బులు రాకుండా అలాంటి సినిమాలను ఏ నిర్మాత కూడా తీయడమే అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. సినీ పరిశ్రమలో అనంత శ్రీరామ్ చెప్పిన మాటలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఒక విధంగా ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి ప్రభాస్ వరకు అందరినీ తప్పు బట్టినట్టే, అలాంటి బడా హీరోల మీద తీవ్రమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి సినిమా రంగం అవకాశాలు ఇస్తుందా అనేది అనుమానమే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భారీ ఎత్తులో ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ సినిమా రంగంపై చేసిన పలు విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారని కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ప్లాన్ ప్రకారమే సినిమాలలో హైందవ ధర్మాన్ని హసనం చేస్తున్నారని, కొందరి అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుందని గుర్తు చేశారు. ఇక కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని ఆయన్ని శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరు అని, సినిమాలలో ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నానని అనంత శ్రీరామ్ తెలిపారు.