https://oktelugu.com/

Mahesh Babu For Acharya: ‘ఆచార్య’కి మహేష్ మాట సాయం.. ఇక తెలుగు నెల దద్దరిల్లిపోద్ది

Mahesh Babu For Acharya: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో సినిమా వస్తోంది అంటేనే.. కేకలతో ఈలలతో తెలుగు నెల దద్దరిల్లిపోద్ది. అందుకే, క్రేజీ భారీ మల్టీస్టారర్ గా ‘ఆచార్య’ తిరుగులేని క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఈ క్రేజ్ రెండింతలు పెరగబోతుంది. ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రంగంలోకి దిగాడు. ‘ఆచార్య’ సినిమాలో ‘చిరు – చరణ్ పాత్ర’ల దగ్గర నుంచి దేవాలయాల నేపథ్యం వరకూ మహేష్ ఓవర్ తోనే […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 03:42 PM IST
    Follow us on

    Mahesh Babu For Acharya: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో సినిమా వస్తోంది అంటేనే.. కేకలతో ఈలలతో తెలుగు నెల దద్దరిల్లిపోద్ది. అందుకే, క్రేజీ భారీ మల్టీస్టారర్ గా ‘ఆచార్య’ తిరుగులేని క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఈ క్రేజ్ రెండింతలు పెరగబోతుంది. ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రంగంలోకి దిగాడు.

    ‘ఆచార్య’ సినిమాలో ‘చిరు – చరణ్ పాత్ర’ల దగ్గర నుంచి దేవాలయాల నేపథ్యం వరకూ మహేష్ ఓవర్ తోనే ఈ సినిమా నడుస్తోంది. అలాగే సినిమా ముగింపు కూడా మహేష్ డైలాగ్ తోనే ముగుస్తుంది. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఆచార్యకి మహేష్ మాట తోడు అయితే.. ఇక థియేటర్స్ కూడా ఊగిపోవడం ఖాయం.

    Mahesh Babu, Chiranjeevi

    మొత్తానికి మెగా మూవీకి మహేష్ మాట సాయం చేశాడు అని వార్త రాగానే.. తెలుగు సోషల్ మీడియా కూడా ప్రస్తుతం షేక్ అయిపోతుంది. ఇక ఇది వరకే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చి.. ఆ సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాడు. ఎన్టీఆర్ బాద్షా కి, పవన్ కళ్యాణ్ జల్సాకి కూడా మహేష్ తన వాయిస్ ఇచ్చాడు.

    Also Read: Vijay Devarakonda- Samantha: ఈ రోజు పూజ.. ఎల్లుండు ‘సమంత’తో రొమాన్స్ !

    క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న ఆచార్యకు భారీగా బిజినెస్ జరుగుతుంది. సహజంగానే మెగా హీరోల సినిమాలకు ఎక్కువ బిజినెస్ ఉంటుంది. కాకపోతే.. ఆచార్యకి అంతకు మించి ఉంది. ఒక్క ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఆచార్య సినిమాకి 110 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 151 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా ఇమేజ్ కూడా పడింది. కాబట్టి, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో నలభై కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ఆచార్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 192 కోట్లు జరిగింది. అందుకే, ఏప్రిల్ 29న మెగా ఫ్యాన్స్ జాతరకి రెడీగా ఉన్నారు.

    Also Read: Chandra Babu Naidu: యాత్రలు కలిసొచ్చేనా?.. త్వరలో చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ ల పాదయాత్ర

    Recommended Videos:

    Tags