Dil Raju Game Changer Comment: రామ్ చరణ్(Global Star Ram charan) అభిమానులకు ఒక పీడకల లాంటి సినిమా ‘గేమ్ చేంజర్'(Game Changer Movie). #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా ఈ చిత్రం అందుకోలేక పోయింది. నిర్మాత దిల్ రాజు(Dil Raju) చేత అనవసరమైన ఖర్చు పెట్టించారని ఈ సినిమా ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. పాటలకు అనవసరమైన ఖర్చు చేయించినట్టు గా అనిపించింది. అందుకే ఈ సినిమా విడుదల తర్వాత దిల్ రాజు కి ‘గేమ్ చేంజర్’ చిత్రం పేరు ఎత్తితేనే కోపం వచ్చినట్టుగా ప్రవర్తించేవాడు. బహుశా ఆయనకు డైరెక్టర్ శంకర్ మీద పీకల దాకా కోపం ఉన్నట్టు ఉంది. ఇది ఇలా ఉండగా ఆయన నిర్మాణ సంస్థ నుండి తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రం వచ్చే నెల నాల్గవ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ గేమ్ చేంజర్ చిత్రం ఫైనల్ ఔట్పుట్ 4 గంటల 45 నిమిషాలు వచ్చినట్టు రీసెంట్ గా ఒక ఎడిటర్ చెప్పాడు. మరో షాకింగ్ విషయం మాకు తెలిసినది ఏమిటంటే, దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని విడుదలకు రెండు మూడు రోజుల ముందే చూసారని.ఇందులో ఎంత వరకు నిజముంది?’ అని అడిగాడు. దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నప్పుడు దిల్ రాజు కి మాత్రమే కాదు, ఏ నిర్మాతకు అయినా ఇలాంటివి సహజం. గేమ్ చేంజర్ సినిమా నాలుగున్నర గంట వచ్చిందని ఎడిటర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, అది వాస్తవమే. మరో సమస్య ఏమిటంటే పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నప్పుడు మనం మధ్యలో దూరలేము’.
Also Read: Dil Raju : రంగంలోకి దిల్ రాజు…రేవతి కుటుంబానికి పరామర్శ.. ఇండస్ట్రీ సమస్యలు తీర్చబోతున్నాడా..?
‘దూరితే ప్రతీ రోజు కిచిడి అవుతుంది. తప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత నిర్మాతదే. దానిని నేను ఆపలేకపోయాను. ఇది నా ఫెయిల్యూర్ గా భావిస్తున్నాను. దీనిని నేను అంగీకరించాలి. ఎందుకంటే నేను ఇలాంటి ప్రాజెక్ట్ ని ఎత్తుకొని ఉండకూడదు. ఇప్పటి వరకు నేను 58 సినిమాలు చేసి ఉంటాను. వాటిలో నేను పెద్ద డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు చాలా తక్కువ. పెద్ద డైరెక్టర్ తో సినిమా తీస్తున్నప్పుడు కాంట్రాక్టు లో క్లియర్ గా నా పాయింట్స్ పెట్టి సినిమాకి వెళ్ళాల్సింది,కానీ అది చెయ్యలేకపోయాను. ఇవన్నీ నా పొరపాట్లే. అందుకే వాటిని అంగీకరించి ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే నేను చివరి క్షణం వరకు సినిమా చూడలేదు అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ముందుగానే చూసాను’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Induke ra ninnu dengedi erripuka @shankarshanmugh
Lophar nankodaka, poi ah indian2 teesko sachina maku e daridram undedi kadhu. 4 years time waste. pic.twitter.com/XGHQM5nLvw
— Doctordeath☠ (@yugeshroyal1) June 23, 2025