Unique Bike Design: సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ పిచ్చి యువతలో పీక్స్‌కు చేరుతోంది. లైక్స్ రాకుంటే ఏదో కోల్పోయినట్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్రమంలో లైక్స్, షేర్స్ కోసం డేంజర్ ఫీట్లు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెడుతున్నారు. తాజాగా కొంతమంది యువకులు బైక్‌పై చేసిన ఫీట్ ఒళ్లు గగ్గుల్పొడిచేలా ఉంది.
సోషల్ మీడియా యుగంలో, ఫేమ్ కోసం యువత ప్రమాదకర సాహసాలకు పాల్పడుతోంది. బైక్ స్టంట్స్, అతివేగ డ్రైవింగ్ వంటి చర్యలు వారి జీవితాలను, ఇతరుల భద్రతను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. లైక్‌లు, షేర్‌లు, వైరల్ వీడియోల ద్వారా తక్షణ ఆదరణ పొందాలనే కోరిక వారిని బైక్ స్టంట్స్, రైలు పట్టాలపై సెల్ఫీలు, లేదా ఎత్తైన భవనాలపై ఎక్కే సాహసాల వైపు నడిపిస్తోంది. సమవయస్కుల ఒత్తిడి, సాహసం పట్ల ఆకర్షణ కూడా ఈ చర్యలకు ఊతమిస్తున్నాయి. అయితే, ఈ సాహసాల వెనుక ఉన్న ప్రమాదం గురించి వారు తక్కువగా ఆలోచిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
యువకులు బైక్‌ఫై ఫీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బైక్ నడిపే యువకుడి వెనక.. ఐదుగురు కూర్చున్నారు. డ్రైవ్ చేస్తున్న యువకుడు పెట్రోల్ ట్యాంకుపై కూర్చున్నాడు. ఇక మరో యువకుడు హ్యాండిల్‌పై కూర్చున్నాడు. ప్రమాదకరమని తెలిసినా.. ఆ యువకులు ఇలా ఫీట్ చేయడం చూసి నెటిజన్లు సాక్ అవుతున్నారు. ఈ స్టుపిట్స్ ఎక్కడ అని కొందరు కామెంట్ చేశారు. కొందరు వారిని పట్టుకుని శిక్షించండి అని,.. మరికొందరు… బతకబుద్ది కావడం లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు పోలీసులు ఏం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విషాదకర పరిణామాలు
ఈ ప్రమాదకర చర్యలు తరచూ దుర్ఘటనలకు దారితీస్తాయి. బైక్ స్టంట్స్ సమయంలో సంభవించే ప్రమాదాలు, అతివేగం వల్ల జరిగే రోడ్డు యాక్సిడెంట్లు ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. ఒక వ్యక్తి చనిపోవడం వల్ల వారి కుటుంబం మానసిక, ఆర్థిక క్షోభను అనుభవిస్తుంది. అంతేకాక, ఈ చర్యలు ఇతర ప్రయాణికులకు, పాదచారులకు కూడా హాని కలిగించవచ్చు. ఇలాంటి సంఘటనలు సమాజంలో భద్రతా సమస్యలను తీవ్రతరం చేస్తాయి.
సమాజం, వ్యవస్థల బాధ్యత
ఈ సమస్యను అరికట్టడానికి సమగ్ర విధానం అవసరం. పాఠశాలలు, కళాశాలలలో సోషల్ మీడియా యొక్క సరైన వినియోగం, ప్రమాదకర చర్యల ఫలితాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
చట్టపరమైన చర్యలు: ప్రమాదకర స్టంట్స్, అనుమతి లేని రేసింగ్‌లపై కఠిన జరిమానాలు, చట్టపరమైన శిక్షలు అమలు చేయాలి.
కుటుంబ మార్గదర్శనం: తల్లిదండ్రులు యువతలో సానుకూల విలువలను నాటడం, సోషల్ మీడియా ఒత్తిడిని తగ్గించడం మీద దృష్టి పెట్టాలి.
ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణ: సోషల్ మీడియా సంస్థలు ప్రమాదకర కంటెంట్‌ను పర్యవేక్షించి, తొలగించే విధానాలను కఠినతరం చేయాలి.
అది బైకా.. లేక ఇంకేమన్నానా!!
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.
జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.
సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025