Dil Raju War 2: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అటు హృతిక్ రోషన్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా హిందీ డబ్ చిత్రం కావడంతో ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాలకు ఉండే క్రేజ్, హైప్ ఈ సినిమాకు ఉండే అవకాశాలు లేవు. అందుకే యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎవరికీ ఈ సినిమాని అమ్మకుండా తన సొంత బ్యానర్ పైనే తెలుగు లో కూడా విడుదల చేస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు అనేక ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ చిత్రం విడుదల రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కి ‘వార్ 2’ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. మన తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన అక్కినేని నాగార్జున సొంతం చేసుకున్నాడు. భారీ లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే కూలీ కి చెక్ పెట్టేందుకు దిల్ రాజు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ ని బుక్ చేయడం ఆరంభించారు. ‘కూలీ’ కి సంబంధించి ఇంకా థియేటర్స్ బుకింగ్ మొదలు అవ్వలేదట. ఇదే అదనుగా తీసుకొని మొత్తం థియేటర్స్ ని బ్లాక్ చేసే పనిలో పడ్డాడట దిల్ రాజు. ఉదాహరణకు నాలుగు థియేటర్స్ ఉన్న ఒక సెంటర్ లో మూడు థియేటర్స్ ‘వార్ 2’ కోసం బుక్ చేస్తున్నాడట.
అయితే క్రేజ్ లేని సినిమాని ఎంత పైకి లేపాలి చూసినా లేపలేరని, ‘కూలీ’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉందని, మొదటి రోజు థియేటర్స్ రానివ్వకుండా చేయగలరేమో కానీ, కూలీ డిమాండ్ ని చూసి సహజంగానే థియేటర్స్ ని పెంచడం మొదలు పెడతారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. గత సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రం కోసం ‘హనుమాన్’ కి థియేటర్స్ దక్కకుండా ఇలాంటి ప్రయత్నమే చేసారని, కానీ హనుమాన్ సునామీ ని చూసి మొదటి రోజు థియేటర్స్ ఇవ్వము అన్నవారే బ్రతిమిలాడి తమ థియేటర్స్ లో వేసుకున్నారని ఆ చిత్రం నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఒక సంస్థ అధినేత ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అదే సీన్ ‘వార్ 2’ మరియు ‘కూలీ’ విషయం లో రిపీట్ కాబోతుందా లేదా అనేది చూడాలి.