Devisri Prasad – Anirudh : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వారిలో దేవి శ్రీ ప్రసాద్(Devisri Prasad), అనిరుద్(Anirudh Ravichander) వంటి వారు కచ్చితంగా ఉంటారు. వీళ్లిద్దరి ఆల్బమ్స్ 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా విడుదల దగ్గర పడుతున్నా కూడా రీ రికార్డింగ్ మరియు ఇతర మ్యూజిక్ పనులు పూర్తి చేయరు. చాలా ఆలస్యంగా ఔట్పుట్ ని డెలివరీ చేస్తున్నారని, నిర్మాతలకు చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరి మ్యూజిక్ డైరెక్టర్స్ వల్ల ఇప్పుడు రెండు సినిమాలు రిస్క్ లో పడ్డాయి. కుబేర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, కింగ్డమ్ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
కింగ్డమ్ చిత్రం మే 31 న విడుదల అవ్వాల్సిన సినిమా. బ్యాక్ గ్రౌండ్ వర్క్ మరియు రీ రికార్డింగ్ వర్క్ పెండింగ్ ఉండడంతో పాటు కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యంతో జులై 4 కి వాయిదా వేశారు. రీ షూటింగ్ అయితే జరిగింది కానీ, అనిరుద్ నుండి జరగాల్సిన పనులు మాత్రం ఇంకా జరగలేదు. ఇంకా మూడు పాటలు కంపోజ్ చేయాల్సి ఉంది. అదే విధంగా రీ రికార్డింగ్ వర్క్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో బోలెడన్ని క్రేజీ తమిళ చిత్రాలు ఉన్నాయి. వాటి పనులను ముగించే పనిలో నిమగ్నమయ్యాడు. ఆయన సంగీతం అందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం ఉంది. ప్రస్తుతం ఆ సినిమా రీ రికార్డింగ్ పనుల్లోనే ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. కూలీ కి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యే వరకు ఆయన కింగ్డమ్ వైపుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
దర్శక నిర్మాతలు మా వర్క్ తొందరగా ఇవ్వు అని గట్టిగా కూడా అడగలేరు . ఎందుకంటే ఇండియా లోనే టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు కాబట్టి. దీంతో మేకర్స్ కి తమ బాధని ఎవరికీ చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. కేవలం అనిరుద్ ఆలస్యం కారణంగానే ‘కింగ్డమ్’ చిత్రం మరోసారి వాయిదా పడబోతోంది. అనిరుద్ అంటే బిజీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నుండి వర్క్ ఆలస్యం అయినా ఒక అర్థం ఉంది. కానీ దేవిశ్రీ ప్రసాద్ అనిరుద్ రేంజ్ బిజీ కాదు. ఈమధ్య కాలం లో ఆయన ఎక్కువగా సినిమాలకు మ్యూజిక్ ని ఇవ్వడం కంటే లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల కుబేర చిత్రానికి ఇవ్వాల్సిన మ్యూజిక్ ఇంకా పెండింగ్ లోనే పెట్టాడట. ఇంకా ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల అవ్వాలి, అదే విధంగా సెకండ్ హాఫ్ రీ రికార్డింగ్ వర్క్ కూడా చాలా బ్యాలన్స్ ఉంది. సినిమా విడుదలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఎలా చేస్తారో చూడాలి.