Bunny Vasu On Charan And Trivikram: మెగా మరియు అల్లు కాంపౌండ్ మధ్య ఎదో చిన్న గ్యాప్ ఉంది అని అనేక సార్లు అనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మెగా షాడో నుండి బయటకి వచ్చి అల్లు బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడమే అందుకు కారణం. ఒకప్పుడు మెగా, అల్లు లాంటి గ్రూప్స్ ఉండేవి కాదు. మొత్తం మెగా ఫ్యామిలీ లాగానే కలిసి ఉండేవారు. కానీ ‘సరైనోడు’ చిత్రం తర్వాత నుండి అల్లు అర్జున్ లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. దానికి తోడు రామ్ చరణ్(Global Star Ram Charan) ‘కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్’ పెట్టడం అల్లు అర్జున్ కి అసలు ఇష్టం ఉండేది కాదని ఇండస్ట్రీ లో అంటూ ఉంటారు. అయితే ఇలాంటి రూమర్స్ అన్ని అల్లు కుటుంబం మెగా ఫ్యామిలీ తో కలిసి ఉండకుండా ఉన్నన్ని రోజులు మాత్రమే. ఏదైనా కష్టమొస్తే మొత్తం ఒక్కటి అయిపోతారు.
ఉదాహరణకు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి రావడాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ లేవు అని అభిమానులు అనుకునేలా చేస్తుంటాయి. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో రావాల్సిన సినిమా రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యిందని, అది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వల్లనే జరిగిందని సోషల్ మీడియా లో ఒక పుకారు షికారు చేస్తుంది. అల్లు అర్జున్ కి జనసేన పార్టీ కి అత్యంత సన్నిహితంగా ఉండే బన్నీ వాసు(Bunny Vasu) రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఛానల్ లో యాంకర్ బన్నీ వాసు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఉంది అన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా?’ అని అడుగుతాడు.
దానికి బన్నీ వాసు సమాధానం చెప్తూ ‘కచ్చితంగా ఆ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మాత్రం డైరెక్టర్ గారే చెప్పాలి. స్టోరీ రెడీ అయినప్పుడు ఆయనే ప్రకటిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా అంటున్నారు?, అల్లు అర్జున్ తో అనుకున్న కథ ని రామ్ చరణ్ తో చేస్తున్నారా అని అడిగితే ‘రామ్ చరణ్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి నాకు తెలీదండి..దయచేసి ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడగొద్దు. దీనిని ఈ ఇంటర్వ్యూ నుండి కట్ చేయండి’ అంటూ చిరాకుగా అడుగుతాడు. దీనిని చూసి కచ్చితంగా ఎదో జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి ప్రాణ స్నేహితుడు. ఆయన ఏది చెప్తే అదే ఫైనల్. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యేలా చేసాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
