Samantha- Preetham jukalker: అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, హీరోయిన్ సమంత ఇద్దరు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు కాపురం చేసి విడిపోయారు. చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. దీంతో అటు నాగచైతన్య ఇటు సమంత ఎవరి కెరీర్ పై వారు దృష్టి పెట్టారు. సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయారు. కానీ ఎవరి పని వారు చేసుకుంటే మంచిదే. కానీ ప్రస్తుతం సమంత మరో మంటకు తెర లేపింది. తన డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి డేట్ నైట్ కు వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత చేష్టలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా ఒక ఉద్దేశం ప్రకారం చేస్తున్నట్లు కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి.

అసలు నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కారణం ఆమె డిజైనరే కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్య తన కెరీర్ పరంగా దేన్ని పట్టించుకోకుండా దూసుకెళ్తుంటే సమంత మాత్రం ఇలా చిల్లర పనులు చేస్తుందని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. సమంత తీరుపై విమర్శలు చేస్తున్నారు. నాగచైతన్యపై కోపంతోనే సమంత ఇలా ప్రవర్తించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కినేని కుటుంబం పరువు తీసేందుకు సమంత కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సమంత ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ముందు చూపుతో తన కెరీర్ ను మలుచుకోవడంపై దృష్టి పెట్టకుండా ఇలా అడ్డదారుల్లో వెళ్లడం మాత్రం ఆమెకు మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కానీ సమంత వాటిని పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని వెళ్తోన్నట్లు కనిపిస్తోంది. అందుకే తన స్నేహితులు సాధనసింగ్, డిజైనర్ ప్రీతమ్ తో కలిసి తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నాగచైతన్యకు కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తున్నాడే కానీ ఎవరితో కూడా చనువుగా ఉండటం లేదు. చైతు సమంతలను కలపాలని వారి కుటుంబసభ్యలు ప్రయత్నాలు చేస్తుంటే సమంత మాత్రం ఇలాంటి విషయాలు షేర్ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి సమంత దారి తప్పి ప్రవర్తించడంపై అందరిలో ఆగ్రహం వస్తోంది. కానీ ఆమె మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా తన మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశాలుండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా పెడచెవిన పెడుతోంది.
ఈ నేపథ్యంలో సమంత భవితవ్యం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడంటే వయసులో ఉంది కాబట్టి తిరుగుతోంది. రేపు వయసైపోయాక ఎవరి అండలో ఉంటుంది. ఎలా జీవితాన్ని కొనసాగిస్తుంది అనే సంశయాలు వస్తున్నాయి. సమంత అక్కినేని కుటుంబంలో మరో మంట పెట్టినట్లు దీని ద్వారా తెలుస్తోంది.


