Chiranjeevi: తనకి సూపర్ హిట్లు ఇచ్చిన ఆ డైరెక్టర్ తో చిరంజీవి కి మాటలు లేవా..?

అవకాశం వచ్చిన ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఒకే ఒక్కడు చిరంజీవి...అన్ని రంగాల్లో ఉన్నవారు ప్రస్తుతం చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By: Gopi, Updated On : February 20, 2024 2:53 pm
Follow us on

Chiranjeevi: ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మన సంకల్ప బలం స్ట్రాంగ్ గా ఉంటే ప్రతిదీ సాధ్యం అవుతుందని చెప్పడానికి చిరంజీవిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.ఆయన ఏ సపోర్టు లేకుండా ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి హీరో అవ్వాలనే ఒకే ఒక ఆశతో మద్రాస్ వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఇక మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చాడు.అవకాశం వచ్చిన ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఒకే ఒక్కడు చిరంజీవి…అన్ని రంగాల్లో ఉన్నవారు ప్రస్తుతం చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన నటులు కూడా చాలామంది ఉన్నారు.

ఇక ఇప్పటికే ఆయన పేరు చెప్పుకుంటూ చాలామంది నటులు ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోగా సినిమాలు చేస్తున్న చిరంజీవి కి కోదండ రామిరెడ్డి పరిచయం అయ్యాడు. ఇక ఆయన డైరెక్టర్ గా, చిరంజీవి హీరోగా దాదాపు 20 కి పైన సినిమాలు వచ్చాయి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఖైదీ సినిమాతో మొదలైన వీళ్ళ కాంబినేషన్ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కోదండ రామిరెడ్డి చిరంజీవి పైన కొన్ని కామెంట్లు అయితే చేశాడు.

ఇక అప్పటి నుంచి చిరంజీవి ఆయనతో మాట్లాడటం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. చిరంజీవిని ఎవరెవరైతే దుషించారో వాళ్లంతా చిరంజీవిని కలిసి క్షమాపణలు కూడా చెప్పారు. మరి ఇలాంటి క్రమంలో కోదండరామిరెడ్డి కూడా చిరంజీవితో కలిసిపోతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మరికొందరు మాత్రం చిరంజీవి ఎవరిని ద్వేషించడం లేదు ప్రస్తుతం ఆయన అందరితో మాట్లాడుతున్నాడు అంటూ చెబుతున్నారు…