Mrugaraju-Movie
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా చాలా సంవత్సరాల పాటు వెలుగుందుతున్న ఒకే ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తు ఇప్పటికి ఆయన స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన విశ్వంభర అనే సినిమాతో ఎలాగైనా సరే ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనే ఉత్సాహంతో డిఫరెంట్ వే లో సినిమా చేస్తూ మంచి సక్సెస్ ని కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన మృగరాజు సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాని మొదట గుణశేఖర్ చిరంజీవితో కాకుండా వేరే హీరోతో చేయాలనుకున్నాడట. ఆయన ఎవరు అంటే మలయాళ సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్ స్టార్ గా గుర్తింపు పొందిన మోహన్ లాల్.. అవును మీరు వింటుంది నిజమే.. ఈ సినిమా కథను గుణశేఖర్ మొదట మోహన్ లాల్ కి చెప్పారట..
దానికి మోహన్ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యలో చిరంజీవి ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తను ఈ సినిమాని చేసి సక్సెస్ అందుకోవాలనుకున్నాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ సినిమాలో కథపరంగా కొన్ని మిస్టేక్స్ ఉండడంతో ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు. ఇక 2001 వ సంవత్సరంలో వెంకటేష్ దేవి పుత్రుడు, బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలకు దీటుగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాల్లో దేవిపుత్రుడు, మృగరాజు రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వగా, నరసింహనాయుడు మాత్రం ఇండస్ట్రీ హిట్టు కొట్టింది…ఇక మొత్తానికైతే మోహన్ లాల్ తో చేయాల్సిన సినిమాని చిరంజీవి చేసి ఒక భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడనే చెప్పాలి…