https://oktelugu.com/

Abbas: అబ్బాస్ కొడుకును చూస్తే దిమ్మదిరగాల్సిందే.. వైరల్ అవుతోన్న ఫొటోలు

అబ్బాస్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోను తాజాగా రిలీజ్ చేశాడు. ఇందులో అబ్బాస్ భార్య, కూతురుతో పాటు కుమారుడు ఉన్నాడు. వీరిలో కుమారుడు ఐమాన్ అచ్చం అబ్బాస్ లాగే ఉన్నాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2024 / 10:48 AM IST

    abbas 2

    Follow us on

    Abbas: సౌత్ సినీ ఇండస్ట్రీ కొందరికి అవకాశాల పంట అని చెప్పుకోవచ్చు. నార్త్ లో చిన్న చిన్న సినిమాల్లో నటించిన వారు దక్షిణాన బంపర్ ఆఫర్ కొట్టుస్తారు. బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించిన నటుడు అబ్బాస్.. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ‘కాదల్ దేశం’లో నటించి ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం సినిమాలను వీడి జర్మనీలో ఉంటున్నాడు. అయితే ఇటీవల ఆయన కుమారుడిని పరిచయం చేస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ఇంతకీ అబ్బాస్ కొడుకు ఎలా ఉన్నాడంటే?

    1996లో రిలీజ్ అయిన ‘ప్రేమదేశం’ ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఈ సినిమాను చూసి యూత్ తెగ ఎంజాయ్ చేశారు. ఇందులో వినిత్, అబ్బాస్ అనే ఇద్దరు హీరోలు నటించారు. వీరిలో అబ్బాస్ విపరీతంగా ఫేమస్ అయ్యాడు. అతని క్రాప్ స్టైల్ అందరికీ నచ్చడంతో హెయిర్ సెలూన్లలో ‘అబ్బాస్ కటింగ్’ చేయమని కోరారు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న అబ్బాస్ ఆ తరువాత పలు అవకాశాలను దక్కించుకున్నాడు.

    abbas son

    అయితే ప్రేమదేశం తరువాత నటించిన సినిమాల్లో అబ్బాస్ కు ఏ ఒక్కటి సరైన గుర్తింపు తేలేదు. దీంతో సినిమాలు తగ్గడంతో జర్మనీకి వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ గా, పెట్రోల్ బంకుల్లో పనిచేశాడు. ఆ తరువాత సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్నాడు. ఫారిన్ వెళ్లిన తరువాత అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎమిరా, ఐమాన్ అనే ఇద్దరు సంతానం.

    అబ్బాస్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోను తాజాగా రిలీజ్ చేశాడు. ఇందులో అబ్బాస్ భార్య, కూతురుతో పాటు కుమారుడు ఉన్నాడు. వీరిలో కుమారుడు ఐమాన్ అచ్చం అబ్బాస్ లాగే ఉన్నాడు. కూతురు కూడా ఎంతో అందంగా ఉన్నారు. అయితే వీరు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అబ్బాస్ కొడుకును చూసిన తండ్రి లాగే సినిమాల్లోకి వస్తాడా? అని కామెంట్లు పెడుతున్నారు.