https://oktelugu.com/

Tollywood: తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరో తెలిసిపోయింది..? చిరంజీవి ప్లేస్ ను దక్కించుకునే ఆ స్టార్ హీరో ఇతనే…

ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరి లక్ష్యం ఒకటే...సూపర్ హిట్ సినిమాను చేయాలి అందరికంటే నేనే టాప్ హీరో గా ఉండాలనే ఒక చిన్న పాటి స్వార్థం అయితే అందరిలో ఉంటుంది...దాని వల్లనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు..

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 02:06 PM IST

    Tollywood(2)

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారు మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచే ప్రయత్నం చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఒకప్పుడు నెంబర్ వన్ హీరోగా గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఇక ఆయన తర్వాత నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ స్టార్ హీరోలుగా వెలుగొందారు. ఇక వీళ్ళ జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్లలో చిరంజీవి తనదైన రీతిలో సినిమాలను చేసి నెంబర్ వన్ హీరో గా ఎదగడమే కాకుండా తనకున్న స్టార్ డమ్ ను కాపాడుకుంటూ అప్పటినుంచి ఇప్పటివరకు ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

    మరి ఇలాంటి క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఉన్న హీరోల్లో ఎవరు ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నారు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లు అందరికి చిరంజీవి ప్లేస్ ని దక్కించుకునే ఛాన్స్ అయితే ఉంది.

    ప్రస్తుతానికైతే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ తన తర్వాత సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి రాబోయే ఒక రెండు సంవత్సరాలలో ఎవరైతే చాలా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసి ఎక్కువ సక్సెస్ లను అందుకొని ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంటారో వాళ్ళకి చిరంజీవి ప్లేస్ ని దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు ఉన్న హీరోలందరిలో ప్రతి ఒక్క హీరో కూడా ఒక సక్సెస్ ఇస్తే మరొక ఫెయిల్యూర్ ని ఇస్తున్నాడు. కాబట్టి కాన్సిస్టెంట్ గా సక్సెస్ ని ఇవ్వలేకపోతున్నారు. దానివల్లనే వాళ్లని మనం నెంబర్ వన్ హీరోగా ఫిక్స్ చేయలేకపోతున్నాం…కాబట్టి రానున్న రెండు మూడు సంవత్సరాలలో హీరోలు మంచి విజయాలను సాధించే దాని మీదనే నెంబర్ వన్ పొజిషన్ అనేది ఆధారపడి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది.చూడాలి మరి వీళ్ళందరిలో ఎవరు చిరంజీవి ప్లేస్ ను రీప్లేస్ చేస్తారు అనేది…