https://oktelugu.com/

nitish kumar reddy pawan kalyan : బాహుబలి, సలార్ కాదు.. నితీష్ కుమార్ రెడ్డి అలా చేయడం వెనక కారణం అదేనట.. పవన్ కూడా ఇదే చెప్పాడుగా..

మెల్ బోర్న్ మైదానంలో అద్భుతమైన సెంచరీ తో టీమ్ ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించి.. మెరుగైన స్థితిలో నిలిపాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. సెంచరీ చేసిన అనంతరం అతడు మైదానంలో జెండాను పాతినట్టు.. తన బ్యాట్ ను పాతి.. ఆపై హెల్మెట్ పెట్టాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2024 / 06:59 PM IST

    nitish kumar reddy pawan kalyan

    Follow us on

    nitish kumar reddy pawan kalyan : ఈ దృశం నిన్నటి నుంచి సోషల్ మీడియా నుంచి మొదలుపెడితే ప్రధాన మీడియా వరకు తెగ సందడి చేసింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి అలా చేయడం వెనక ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషణ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసినప్పుడు పుష్ప సినిమాలో తగ్గేది లేదనే మేనరిజాన్ని.. సెంచరీ చేసిన తర్వాత బాహుబలిలో ప్రభాస్ కత్తి దూసిన దృశ్యాన్ని, సలార్ లో కాటేరమ్మ ముందు విలన్ ను నరికిన సందర్భాన్ని కొంతమంది ప్రస్తావించారు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ పాతిన విధానం కూడా అలానే ఉందని ఉదహరించారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ పాతడం వెనుక ఉన్న ఉద్దేశాలు అవి కావట. దీనిపై స్వయంగా నితీష్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ” మెల్ బోర్న్ మైదానంలో 100 కొట్టిన తర్వాత తర్వాత మైదానంలో బ్యాట్ ను చేతిలోకి తీసుకున్నాను.. హెల్మెట్ ను బ్యాట్ హ్యాండిల్ పై ఉంచాను. అయితే హెల్మెట్ పై ఉన్న భారతీయ జెండాకు నేను సెల్యూట్ చేశాను. ఒక భారతీయుడిగా దేశానికి ఆడటంకంటే గొప్ప ఏముండదు. అందువల్లే మూడు రంగుల జెండాకు నేను సెల్యూట్ చేశానని” నితీష్ కుమార్ రెడ్డి చెప్పాడు.

    పవన్ ఏమన్నాడు అంటే

    నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా తన భావాన్ని వ్యక్తీకరించారు. ” నువ్వు ఎవరు? ఎక్కడివాడివి అనేది ముఖ్యం కాదు. ఏ దేశానికి ఆడావనేదే ముఖ్యం. దేశ గర్వాన్ని నిలబెట్టడం అంత సులభం కాదు. ఇలాగే మరిన్ని ధైర్యవంతమైన ఇన్నింగ్స్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని” పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. .. నితీష్ కుమార్ రెడ్డి మైదానంలో బ్యాట్ పాతిన విషయంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత.. పవన్ కళ్యాణ్ కూడా అదే అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. పవన్ తను చేసిన ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేదు. తెలుగుజాతి పేరును పేర్కొనలేదు. కేవలం భారతీయతను మాత్రమే ఆయన ప్రస్ఫుటించారు. దేశం కోసం ఆడాలని.. దేశ ఖ్యాతిని పెంచే విధంగా ఆడాలని నితీష్ కుమార్ రెడ్డికి పవన్ సూచించారు. ఆ ట్వీట్ నేపథ్యంలో పవన్, నితీష్ అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.