Viswambhara Movie : భారీ గ్రాఫిక్స్ తో మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ‘భింబిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేయగా, ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ చూడగానే కంటెంట్ ఉన్న చిత్రం అని అర్థమైంది కానీ, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడంతో ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాని ముందుగా జనవరి 10వ తారీఖున విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. అధికారికంగా విడుదల తేదీని ని కూడా ప్రకటించారు. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం విశ్వంభర ని వాయిదా వేసుకోవాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి ని కలిసి రిక్వెస్ట్ చేయడం తో ఆయన వెంటనే ఒప్పుకొని వాయిదా వేయడం జరిగిందని దిల్ రాజు ఈ సందర్భంగా ఒక వీడియో ని విడుదల చేస్తూ ఈరోజు ఉదయం చెప్పుకొచ్చాడు.
వాళ్ళ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని, డిసెంబర్ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం మూడేళ్ళ నుండి సెట్స్ మీదున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కావడంతో, సంక్రాంతి అయితేనే అన్ని భాషలకు పర్ఫెక్ట్ గా ఉంటుందని మా టీం మొత్తంతో చర్చించుకున్నామని, ఇదే విషయాన్ని చిరంజీవి గారికి వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పారని, ఆయన ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాం అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే ఒక సినిమాని పోస్ట్ పోనే చేయాలంటే చిన్న విషయం కాదు. నిర్మాతలు ఫైనాన్షియర్స్ దగ్గర నుండి డబ్బులు వడ్డీ కి తీసుకొస్తారు, నెల వారీగా డబ్బులు కట్టాల్సిందే, అలాగే సెట్ ప్రాపర్టీస్, సినిమా కోసం పని చేసే టెక్నీషియన్స్ కి నెలవారీ జీతాలు కూడా ఇస్తుండాలి, ఇవన్నీ కోట్ల రూపాయలతో ముడిపడిన విషయాలు.
అలా ‘విశ్వంభర’ చిత్రాన్ని వాయిదా వేసినందుకు గానూ నిర్మాతలపై 150 కోట్ల రూపాయిలు అదనపు భారం పడుతుందట. అంతే కాదు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ చాలా నాసిరకంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ట్రోల్స్ వినిపించిన సంగతి తెలిసిందే. VFX పై మళ్ళీ రీ వర్క్ చేసే ప్రక్రియ కూడా చాలా డబ్బులతో ముడిపడింది. ఇలా ఇంత అదనపు డబ్బు భారం పడినప్పటికీ కూడా చిరంజీవి కోసం, రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గేందుకు నిర్మాతలు సిద్ధపడడం కచ్చితంగా అభినందించాల్సిన విషయం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చేసాడు. అలాగే ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి హీరోయిన్లు చిరంజీవి కి సోదరీమణులుగా నటిస్తున్నారు.