https://oktelugu.com/

Pooja Hegde : సీరియల్ హీరోతో ప్రేమాయణం..ప్రైవేట్ పార్టీ లో రచ్చ.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన పూజా హెగ్డే!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో అందంతో పాటు, బోలెడంత టాలెంట్, అదృష్టం ఉండాలి. ఇవన్నీ ఒక అమ్మాయిలో ఉంటే ఆమెనే పూజా హెగ్డే.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 09:00 PM IST
    Follow us on

    Pooja Hegde: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో అందంతో పాటు, బోలెడంత టాలెంట్, అదృష్టం ఉండాలి. ఇవన్నీ ఒక అమ్మాయిలో ఉంటే ఆమెనే పూజా హెగ్డే. ఈమె వరుణ్ తేజ్ హీరో గా నటించిన మొదటి చిత్రం ‘ముకుంద’ ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమె ‘ఒక లైలా కోసం’ సినిమాతో భారీ హిట్ ని కొట్టి, ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పూజా హెగ్డే, మళ్ళీ ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. అయితే ఆమె లేటెస్ట్ చిత్రాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగిన ఆమె ఒక్కసారి కనిపించకుండా పోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే పూజ హెగ్డే కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. వీళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకొని ముంబై లో తిరుగుతున్నట్టుగా అక్కడి మీడియా పసిగట్టింది.

    అంతే కాదు రీసెంట్ గా ఒక ప్రైవేట్ పార్టీ కి ఈ జంట కలిసి వెళ్లారట. ఆ పార్టీ లో పూజా హెగ్డే రోహన్ మిశ్రా పై ముద్దుల వర్షం కురిపించిన ఘటన బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిందని అంటున్నారు. దీంతో వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేల్తున్న విషయం బయటపడిందట. వీళ్ళ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఎప్పుడు ప్రేమించుకున్నారు వంటి వివరాలు లేవు. ఇక పూజా హెగ్డే రీసెంట్ సినిమాల విషయానికి వస్తే, ఈమె బీస్ట్ తర్వాత మరోసారి తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈమె తో పాటు మలయాళం యంగ్ హీరోయిన్ మమతా బైజు కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతుంది. ఈ చిత్రం తో పాటు ఒక బాలీవుడ్ చిత్రం, అలాగే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించేందుకు ఈమె సంతకాలు చేసినట్టు సమాచారం.

    Tags