https://oktelugu.com/

చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

  మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని ప్రతీ దర్శకుడికి ఉంటుంది. అయితే కొందరు మాత్రమే ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. చిరంజీవితో మూవీ చేయాలని కొందరు డైరెక్టర్లు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తుండగా.. మరికొందరికీ మాత్రం ఆ ఆ ఛాన్స్ వెంటనే దక్కుతోంది. అలాంటి వారిలో దర్శకుడు వీవీ. వినాయక్ ఒకడు. Also Read: జూనియర్ ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడంటున్న మాస్ డైరెక్టర్…? మెగాస్టార్-వినాయక్ కాంబినేషన్లో ఇప్పటికే ‘ఠాగూర్’.. ‘ఖైదీ-150’ మూవీలో వచ్చాయి. ఈ రెండు చిత్రాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 09:16 AM IST
    Follow us on

     

    మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని ప్రతీ దర్శకుడికి ఉంటుంది. అయితే కొందరు మాత్రమే ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. చిరంజీవితో మూవీ చేయాలని కొందరు డైరెక్టర్లు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తుండగా.. మరికొందరికీ మాత్రం ఆ ఆ ఛాన్స్ వెంటనే దక్కుతోంది. అలాంటి వారిలో దర్శకుడు వీవీ. వినాయక్ ఒకడు.

    Also Read: జూనియర్ ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడంటున్న మాస్ డైరెక్టర్…?

    మెగాస్టార్-వినాయక్ కాంబినేషన్లో ఇప్పటికే ‘ఠాగూర్’.. ‘ఖైదీ-150’ మూవీలో వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ప్రచారం జరుగుతోంది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ‘లూసీఫర్’ను వినాయక్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడనే టాక్ విన్పిస్తోంది.

    ఇదిలా ఉంటే చిరంజీవితో తన మొదటి సినిమా అవకాశంపై వినాయక్ తాజాగా స్పందించాడు. చిరంజీవి కోసం తాను ముఖ్యమంత్రి కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలోనే రాజారవీంద్ర తనను చిరంజీవి వద్దకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అప్పుడు చిరంజీవి ‘రమణ’ సినిమా గురించి అడిగినట్లు తెలిపాడు. ఆ సినిమా తనకు ఎలా ఉంటుందని అడుగగా అదిరిపోతుందనే సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు.

    ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నానని చిరంజీవి చెప్పారని వినాయక్ తెలిపాడు. క్లైమాక్స్ మార్చాలని చిరంజీవి తనతో అన్నారని చెప్పాడు. దీంతో తాను అంతకుముందే రాసుకున్న కథలోని కొన్ని సన్నివేశాలు.. డైలాగ్స్ చెప్పగా చిరంజీవికి బాగా నచ్చినట్లు చెప్పాడు.

    Also Read: జబర్దస్త్ సుధీర్ కు కరోనా అంటూ వార్తలు.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

    దీంతో తాను  అప్పటికే చిరు కోసం రాసుకున్న కథను వదులుకొని చిరంజీవితో ‘ఠాగూర్’ రీమేక్ చేసినట్లు వినాయక్ చెప్పాడు. అలా చిరుతో తనకు వచ్చిన ఛాన్స్ ను ఒడిసిపట్టుకున్నట్లు వినాయక్ తెలిపాడు. సినిమా కాంబినేషన్స్ మనం అనుకుంటే కుదరవని.. అవకాశం వచ్చినపుడే సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించాడు.