https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు తో పోటీ పడి సైడ్ అయిపోయిన హీరోలు వీళ్లే…

సూపర్ స్టార్ కృష్ణ నటవారుసుడిగా ఇండస్ట్రీ ఇచ్చిన మహేష్ బాబు...మొదట్లో ప్రిన్స్ మహేష్ బాబు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తను చేసిన మొదటి సినిమా ' రాజకుమారుడు ' సినిమా తోనే మంచి హీరోగా పేరును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 04:17 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ప్రతి ఒక్క ఇండస్ట్రీ భయం తో వణికి పోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం మన ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అది భారీ సక్సెస్ ను సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తమదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరోలందరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు…

    సూపర్ స్టార్ కృష్ణ నటవారుసుడిగా ఇండస్ట్రీ ఇచ్చిన మహేష్ బాబు…మొదట్లో ప్రిన్స్ మహేష్ బాబు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తను చేసిన మొదటి సినిమా ‘ రాజకుమారుడు ‘ సినిమా తోనే మంచి హీరోగా పేరును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఇక ఇలాంటి క్రమంలోనే కెరియర్ మొదట్లో మహేష్ బాబుతో చాలామంది హీరోలు పోటీ పడ్డారు. అందులో ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి హీరోలు ఉన్నప్పటికి కానీ వీళ్ళందర్నీ తలదన్నుతూ మహేష్ బాబు వరుసగా మంచి సినిమాలను చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కూడా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మన స్టార్ హీరోలతో పోటీపడ్డారు.

    అయినప్పటికి వాళ్ళు తమ కెరియర్ ను లాంగ్ రన్ లో కాపాడుకోవడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోయారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే.

    తరుణ్ తన పర్సనల్ విషయాల వల్ల ఇండస్ట్రీలో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక సుమంత్ ఇప్పటికే అడపదడప సినిమాలు చేస్తున్నప్పటికి అవేవీ పెద్దగా గుర్తింపునైతే తీసుకురావడం లేదు. ఇక మొత్తానికైతే ఆయన లాంటి హీరో ఇప్పటికి సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో పోటీపడే స్థాయి తనది కాదనే విషయం వీళ్లకు చాలా తొందరగానే తెలిసింది.

    ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం మహేష్ బాబుకు దక్కుతుందనే చెప్పాలి. ఇక రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా సూపర్ సక్సెస్ అయితే కనక మహేష్ బాబు వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది…