https://oktelugu.com/

Vijay Sethupathi: జగపతి బాబు వదులుకున్న ఈ రెండు క్యారెక్టర్లు విజయ్ సేతుపతి ని స్టార్ యాక్టర్ ను చేశాయా..?

సినిమా ఇండస్ట్రీ లో నటుల మధ్య తెలియని ఒక పోటీ వాతావరణం అయితే ఉంటుంది. దాని వల్ల అందరి కంటే నేనే మంచి క్యారెక్టర్లు చేయాలనే తపన అందరిలో ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 12:21 PM IST

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన క్యారెక్టర్ ను మరొకరు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ స్టార్ హీరోలుగా గాని, స్టార్ నటులుగా గాని వెలుగొందుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించి తనదైన రీతిలో విలనిజాన్ని పండించి మంచి పేరునైతే దక్కించుకున్నాడు.ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుడు అయిన విజయ్ సేతుపతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీలో తనను మించిన నటుడు లేడు అనేంతలా మంచి గుర్తింపును పొందుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఆయన చేసిన రెండు క్యారెక్టర్లు మొదట జగపతి బాబు దగ్గరికి వచ్చాయి. కానీ ఆయన వదిలేసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్లను విజయ్ సేతుపతి చేసి భారీ సక్సెస్ లను అందుకున్నాడు.

    ఇక అందులో మొదటిది ఉప్పెన సినిమాలో రాయనం క్యారెక్టర్…ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు మొదట ఈ క్యారెక్టర్ కోసం జగపతిబాబు ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల జగపతిబాబు ఆ క్యారెక్టర్ కి నో చెప్పడంతో ఆ పాత్రకి విజయ్ సేతుపతిని తీసుకొని భారీ సక్సెస్ ని అందుకున్నారు.

    ఆయన పాత్రకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇక అలాగే విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన విలన్ పాత్రను కూడా మొదట జగపతిబాబుతో చేయించాలని లోకేష్ కనకరాజ్ అనుకున్నాడట. కానీ అప్పుడు కూడా ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ సినిమాను వదులుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు క్యారెక్టర్లు చేయడం వల్ల విజయ్ సేతుపతి టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఇదిలా ఉంటే జగపతి బాబు కూడా చాలా మంచి పాత్రలను పోషిస్తున్నాడు. ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన మంచి పాత్రల్లో రంగస్థలం, అరవింద సమేత లాంటి సినిమాలు ఉన్నాయి.

    ఈ రెండు సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా అందులోను తన విలనిజానికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా ఏర్పడింది… ఇక దీంతో పాటు గా ముందు ముందు జగపతిబాబు చాలా మంచి క్యారెక్టర్ లను చేసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఆయన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నటిస్తూ నటుడిగా చాలా బిజీ గా ఉన్నాడు…