https://oktelugu.com/

Star heroes daughters: ఈ స్టార్ హీరోల కూతుర్లు అనవసరంగా ఇండస్ట్రీ కి వచ్చారా..?

'మంచు లక్ష్మి' అప్పట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. నటిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం దక్కలేదు

Written By:
  • Gopi
  • , Updated On : March 16, 2024 / 12:34 PM IST

    Rajasekhar daughters

    Follow us on

    Star heroes daughters:: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించడానికి చాలామంది హీరోలు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు కూడా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోగా కూడా ఒక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పటికీ ఒకప్పుడు మాత్రం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో చాలా సక్సెస్ లను అందుకున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఈయన కూతురు అయిన ‘మంచు లక్ష్మి'(Manchu Lakshmi) అప్పట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. నటిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో ఆమెకి అవకాశాలు ఇచ్చే వారు కరువయ్యారు. అందుకే ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు కొనసాగలేకపోయింది.

    ఇక ఇదిలా ఉంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజశేఖర్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అప్పటి హీరోల్లో ఆయనకి స్పెషల్ గా ఒక మంచి గుర్తింపు అయితే తీసుకువచ్చింది. ఇక ఇలాంటి రాజశేఖర్ తన కూతుర్లు అయిన శివాని, శివాత్మిక ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్లు గా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరిలో ఎవరూ కూడా అంత సక్సెస్ లను సాధించడం లేదు. అరా కొర సక్సెస్ లు వచ్చినప్పటికీ అవి వాళ్ల ఫ్యూచర్ కి ఎలాంటి హెల్ప్ అవ్వడం లేదు. ఇక దానివల్లే వాళ్ళు నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో కొంచెం కీలకమైన పాత్రను పోషించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో వాళ్ళు చాలా మంచి పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు కూతురు, రాజశేఖర్ కూతుర్లు సినిమా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చారు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి రాజశేఖర్ కూతుర్లు ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు. ఇక ఫ్యూచర్ లో అయిన సక్సెస్ సాధించి తండ్రికి తగ్గ కుతుర్లుగా నిలబడతారా లేదా అనేది చూడాలి…