Adipurush 3D: కేవలం 3D అద్దాల చార్జీలతో ‘ఆదిపురుష్’ చిత్రానికి ఇంత గ్రాస్ వచ్చిందా..ఇది మామూలు మాస్ కాదు!

కనీసం రెండవ వీకెండ్ లో వచ్చే వసూళ్లతో అయినా కాస్త రీ కవర్ అవుతుంది అనుకుంటే, రెండవ వీకెండ్ లో కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. ఇది ట్రేడ్ కి పెద్ద షాక్, దీనితో అటు నిర్మాతలకు మరియు ఇటు బయ్యర్లకు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Written By: Vicky, Updated On : June 27, 2023 9:27 am

Adipurush 3D

Follow us on

Adipurush 3D: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినప్పటికీ, నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీనితో ఈ సినిమాని భారీ రేట్స్ కి కొనుగోలు చేసిన బయ్యర్స్ గుండెల్లో గుబులు మొదలైంది.

కనీసం రెండవ వీకెండ్ లో వచ్చే వసూళ్లతో అయినా కాస్త రీ కవర్ అవుతుంది అనుకుంటే, రెండవ వీకెండ్ లో కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. ఇది ట్రేడ్ కి పెద్ద షాక్, దీనితో అటు నిర్మాతలకు మరియు ఇటు బయ్యర్లకు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అసలు ఈ సినిమాకి ఈ మాత్రం అయినా వసూళ్లు రావడానికి కారణం 3D ఫార్మటు వల్లే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

3D ఫార్మాటులో వచ్చిన వసూళ్లతో పోలిస్తే 2D వెర్షన్ వసూళ్లు చాలా తక్కువ అని,మేకర్స్ సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు సునామి లాంటి వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అయితే వచ్చిన వసూళ్ళలో షేర్స్ లో 3D చార్జీలు కలుపుతారు కానీ, గ్రాస్ లో మాత్రం కలపరు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

కానీ ఆదిపురుష్ చిత్రానికి గ్రాస్ లో కూడా 3D చార్జీలు కలిపారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, అందులో కేవలం 3D చార్జీల ద్వారా వచ్చిన డబ్బులను లెక్కగడితే, ఏకంగా 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. 3D లో చూసిన ప్రతీ ఒక్కరికి ఈ సినిమా కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన అనుభూతిని కలిగించింది, అందుకే టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు ఆ స్థాయిలో వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.