Guntur Kaaram: స్టార్ హీరోలు నటిస్తున్నారంటే ఆ సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా మషేష్ బాబు సినిమా గురించి ఓ అప్డేట్ రావడంతో అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో పాటు రీసెంట్ గా ధూమ్ మసాలా సాంగ్ విడుదలవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో మహేష్ త్రివిక్రమ్ కలిసి మ్యాజిక్ చేస్తారని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ ఫస్ట్ సింగిల్ కు హైలెట్ గా నిలిచింది. 2024 సంవత్సరం మహేష్ బాబు సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సాహిత్యం విషయంలో కూడా తన వంతు సహాయం చేశాడట త్రివిక్రమ్. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో మహేష్ బాబు అభిమానులు ఆశలు ఫలించాయనే చెప్పాలి. ఈ పాటకు స్పైస్ ర్యాప్ అని పేరు పెట్టారు కూడా.. హేమచంద్ర, విక్కీ సంయుక్తంగా ఈ పాటను ఆలపించడం గమనార్హం. త్రివిక్రమ్ భావుకత ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ మొదలుకావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
జనవరి నెల12వ తేదీనా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు రికార్డులు బ్రేక్ అవడం పక్కా అంటున్నారు. మరోవైపు గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ గురించి ఒకింత టెన్షన్ కూడా ఉందట. కానీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని కన్పూజన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు మేకర్స్. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంతకు మించి కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు నెటిజన్లు.