Odi World Cup 2023: ఒక తుఫాన్ విరుచుకుపడుతున్నట్టు.. ఒక అల మింగేస్తున్నట్టు.. అంత నిర్ధయగా.. నిరంకుశంగా సాగుతోంది టీమిండియా దండయాత్ర.. అన్ని జట్లను సౌతాఫ్రికా బెంబేలెత్తించి 350+ స్కోర్లు చేసి చిత్తు చేసే అదే సౌతాఫ్రికాను మన టీమిండియా పిల్లికూనలా మార్చి 83కే ఆలౌట్ చేసింది. అలాంటి ఇలాంటి ఆట టీమిండియా ఆడడం లేదు. అందరూ ఇండియా పిచ్ ల మీద ఆడుతుంటే.. టీమిండియా అంతరిక్షంలో ఆడుతున్నట్టు కనిపిస్తోంది.. అందుకే ఈ సెమీస్ లో మన టీంతో పాకిస్తాన్ తలపడాలని.. సెమీస్ లో మనోళ్ల ఆట చూడాలని అందరూ కోరుకుంటున్నారు.. మరి అది జరగాలంటే ఈ పరిణామాలు వరల్డ్ కప్ లో చోటు చేసుకోవాలి.. అవేంటో చూద్దాం…
ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇండియన్ టీంని ఓడించడం అంటే అంత ఈజీ కాదు. వరుస విజయాలను సొంతం చేసుకొని ప్రత్యర్థి టీమ్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఏకైక టీం ఇండియన్ టీమ్… బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ తమ స్టామినా ఏంటో చూపిస్తూ గెలుపుని ఆశయంగా మార్చుకొని గెలవాలని ధృడ సంకల్పంతో పోరాడుతూ ప్రతి మ్యాచ్ లో ఒక అద్భుతాన్ని సృష్టించడంతో ఇండియన్ టీం ఇప్పటికే వరుసగా ఎనిమిది విజయాలనైతే దక్కించుకుంది. ఇక దాంతో పాటుగా సెమీస్ కి క్వాలిఫై అయిన మొదటి జట్టు గా కూడా గుర్తింపు పొందింది.
ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇండియన్ టీం తో పోటీపడే టీం ఏది అనేది ఇప్పుడూ సర్వత్రా ఆసక్తిని నెలకొల్పుతుంది… ఇప్పటికే మన చిరకాల ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్తాన్ టీం సెమీఫైనల్ కి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.కాబట్టి పాకిస్తాన్ టీం కనుక సెమీఫైనల్ లోకి వచ్చినట్లు అయితే ఇండియన్ టీమ్ చేతిలో మరోసారి ఓడిపోవడానికి రెడీగా ఉండమని పాకిస్థాన్ టీమ్ కి ఇండియన్ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు…ఏషియా కప్ లో కానీ, వరల్డ్ కప్ లో కానీ ఇప్పటికే ఈ ఇయర్ రెండు సార్లు ఇండియన్ టీమ్ చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్థాన్ సెమీస్ లోకి అడుగు పెట్టాలి ఇండియన్ టీమ్ తో ఆడాలి అంటే ఇలా జరగాలి…
ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ ఇంగ్లాండ్ మీద ఆడే మ్యాచ్ లో భారీ గా విజయం సాధించాలి. అలాగే న్యూజిలాండ్ టీమ్ శ్రీలంక మీద ఆడే మ్యాచ్ లో ఓడిపోవాలి.ఒక వేళ గెలిచిన కూడా నార్మల్ గా గెలవాలి. ఇక అదే విధంగా ఆఫ్గనిస్తాన్ టీమ్ కూడా సౌతాఫ్రికా తో ఆడే మ్యాచ్ లో ఓడిపోవాలి ఇలా జరిగితే పాకిస్థాన్ టీమ్ సెమీస్ కి చేరుకుంటుంది అలాగే ఇండియన్ టీమ్ తో ఆడుతుంది… ఇక ఇప్పటికే నిన్న ఆఫ్గనిస్తాన్ మీద ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియన్ టీమ్ నెంబర్ త్రీ పొజిషన్ లో సెమీస్ కి క్వాలిఫై అయింది…ఇక రెండోవ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తల పడుతాయి.కాబట్టి మొదటి సెమీ ఫైనల్ లో ఇండియా తో పాకిస్థాన్ తలపడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…