Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu: ఎంత కాదు అనుకున్న పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) అభిమానులు ఓజీ చిత్రం కోసం ఎదురు చూస్తున్నంత ఉత్కంఠగా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) గురించి ఎదురు చూడడం లేదు అనేది వాస్తవం. కానీ ‘హరి హర వీరమల్లు’ కథ రీసెంట్ గా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న ‘చావా’ కి మించిన కథ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఈ కథ మహాయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాగా చెప్తున్నారు. శైవ మతంలో జన్మించిన పాపన్న గౌడ్ కులమతాలకు అతీతంగా ఒక మహా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొఘల్ సైనికులు ఆరోజుల్లో పన్నులు వసూలు చేసే క్రమం లో కళ్ళు గీసే వ్యాపారంలో పని చేస్తున్న పాపన్న తో సైనికులు గొడవపడుతాడు. తన స్నేహితుల కోసం అండగా నిలబడి మాట్లాడినందుకు పాపన్న తో గొడవపడుతారు.
ఈ క్రమంలో ఉగ్రరూపం దాల్చిన పాపన్న తనతో గొడవపడిన సైనికుల తలలు నరికేశాడు. మహారాష్ట్ర లో ఛత్రపతి శివాజీ తో సమాంతరంగా మొఘల్ సామ్రాజ్యం పై పోటీ చేసి సనాతన ధర్మం ని పరిరక్షించిన యోధుడిగా పాపన్నకు మంచి పేరుంది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆరోగ్యం క్షీణించే ముందు శివాజీ(Chatrapathi Shivaji Maharaj) దక్షిణ భారత దేశం మొత్తాన్ని పరిపాలించుకోమని పాపన్న చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ పాపన్న నే మన ‘హరి హర వీరమల్లు’. కథ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ చిత్రంలో కచ్చితంగా శివాజీ మహారాజ్ క్యారక్టర్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యారక్టర్ గురించి బయట ఎక్కడ లీక్ కాకుండా నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేసారు. కానీ సోషల్ మీడియా కావడంతో విషయం బయటకు లీక్ అయిపోయింది. శివాజీ క్యారక్టర్ ని ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోతో చేయించారని టాక్. ఎవరు చేసారు అనేది చాలా సీక్రెట్ గా ఉంచారు.
అంతే కాకుండా సినిమా చివరి 15 నిమిషాలు అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుందని సమాచారం. చాలా అద్భుతంగా ఆ పోరాట సన్నివేశాలు తెరకెక్కాయట. అభిమానులు విడుదల రోజు థియేటర్స్ లో తమ చొక్కాలు చింపుకోవడమే కాకుండా, పక్కనోళ్ళ చొక్కాలు కూడా చింపేస్తారు. ఆ రేంజ్ లో ఔట్పుట్ వచ్చిందట. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా, ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం లోని ‘కొల్లగొట్టినాదిరో’ అనే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ని కూడా విడుదల చేస్తున్నారట. 24 వ తారీఖు నుండి ప్రొమోషన్స్ చాలా గట్టిగా జరుగుతాయని, మార్చి 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముంగుకి తీసుకొచ్చినట్టు ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మరోసారి మీడియా కి ఖరారు చేసాడు. చూడాలి మరి అనుకున్న తేదీన ఈ సినిమా వస్తుందా లేదా అనేది.