Homeఆంధ్రప్రదేశ్‌North Andhra teachers MLC Elections : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. కూటమి మద్దతు...

North Andhra teachers MLC Elections : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. కూటమి మద్దతు ఆయనకే!

North Andhra teachers MLC Elections :  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక( North Andhra teachers MLC elections) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని ఉపాధ్యాయ సంఘాలు. ఈనెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి పోలింగ్ జరగనుంది. దాదాపు పదిమంది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ అధికంగా ఉంది. పిడిఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయ గౌరీ యుటిఎఫ్ తరఫున పోటీకి దిగారు. ఏపీటీఎఫ్ తరఫున పాకలపాటి రఘువర్మ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా. మరోవైపు పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు పై పాకలపాటి రఘువర్మ గెలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో దిగుతున్నారు గాదె శ్రీనివాసులు నాయుడు. అయితే వీరిద్దరి మధ్య గట్టిగానే పోటీ ఉండగా.. పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ సైతం గట్టి పోటీ ఇస్తుండడం విశేషం.

* ఏపీటీఎఫ్ కు టిడిపి మద్దతు..
అయితే ఏపీటీఎఫ్( aptf ) తరుపున బరిలో దిగిన పాకలపాటి రఘువర్మకు ( Raghu Verma)మద్దతు తెలిపింది తెలుగుదేశం పార్టీ. విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రఘువర్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు. ఎంపీ శ్రీ భరత్ గీతం విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల్లో ఓట్లు ఉన్నాయి. దీంతో ఇది రఘు వర్మ కు కలిసి వచ్చేలా ఉంది.

* శ్రీనివాసుల నాయుడుకు బిజెపి మద్దతు
అయితే గాదె శ్రీనివాసులనాయుడుకు ( gadhe shrinivasalan Naidu )భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడం విశేషం. కొద్దిరోజుల కిందట బిజెపి ఉత్తరాంధ్ర నేత పివిఎన్ మాధవ్ గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించారు. అయితే అది వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఒకవేళ పార్టీ నిర్ణయం అయితే మాత్రం కూటమిలో విభేదాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తులే ఎన్నికవుతుండడం విశేషం. 2007లో శాసనమండలి పునరుద్ధరణ తరువాత గాదె శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీ అయ్యారు. 2013లో రెండోసారి గెలిచారు. 2019లో మాత్రం పాకలపాటి రఘువర్మ చేతిలో ఓడిపోయారు. అయితే రఘు వర్మ సైతం విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థులతో పాటు విజయ గౌరీ సైతం రంగంలో ఉన్నారు. ఈ తరుణంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ముగ్గురు మధ్య గట్టి ఫైవ్ నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version