Thalapathy Vijay copied Mahesh Babu: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో దళపతి విజయ్ కి క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన గతంలో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాడో ఆయన కూడా అదే రోజులో తన సత్తా చాటాడు. అలాంటి విజయ్ ప్రస్తుతం టివికే అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. తను ఇక్కడ ఏ మేరకు రాణిస్తాడు అనేదే ఇప్పుడు ఆయన అభిమానులను కలవరపెడుతుంది. మొత్తానికైతే ఇంతకు ముందు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన విజయ్ తెలుగు స్టార్ హీరో అయిన మహేష్ బాబును కాపీ చేస్తూ ఉండేవాడు. మహేష్ బాబు ఎలాగైతే నటించేవాడో విజయ్ సైతం అలానే నటించడానికి ప్రయత్నం చేసేవాడు. దానివల్ల కొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సభ పెట్టి మాట్లాడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎలాగైతే లౌడ్ గామాట్లాడేవాడో విజయ్ సైతం అలానే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ను కాపీ చేసి సక్సెస్ అయినంత మాత్రాన రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ ని కాపీ చేసి సక్సెస్ అవ్వడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు.
పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలపాటు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అధికార పార్టీ పెట్టే ప్రతి ఇబ్బందిని తన గట్స్ తో ఎదుర్కున్నాడు. సినిమాలపరంగా కూడా తనను తొక్కేయాలని అధికార పార్టీ ప్రయత్నం చేసిన కూడా పవన్ మేనియా ముందు అవేమి వర్కౌట్ కాలేదు. మరి విజయ్ సైతం ఇప్పుడు అతని మీద వస్తున్న ప్రతి విమర్శను స్వీకరించి దానిని ఎలా తీసుకుంటాడు.
అలాగే తన మీద పడుతున్న నిందలను సైతం ఎలా రూపుమాపగలుగుతాడు అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే విజయ్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతం తన మీద వచ్చే ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. తను ఈ సమయంలో ఎలాంటి డిసిజన్స్ తీసుకోబోతున్నాడు అనేది అతని పార్టీ ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగిపోతుంది అనేదాన్ని డిసైడ్ చేస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తన ఓన్ స్టైల్ లో విజయ్ వెళ్తే బాగుంటుంది. వాళ్ళని వీళ్ళని చూసి కాపీ కొట్టి ముందుకు సాగితే అది అతని ఉనికిని దెబ్బతీసే ప్రమాదమైతే ఉందని తను ఏ ఎజెండాతో వెళ్తున్నాడో దానినే సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు…