Bigg Boss 9 Telugu Shresti Varma: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ నుండి మొట్టమొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు ఇమ్మానుయేల్, తనూజ, శ్రేష్టి వర్మ, సంజన గల్రాని, డిమోన్ పవన్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి , రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. వీరిలో శ్రేష్టి వర్మ(Shresti Varma) ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. కాసేపటి క్రితమే ఈ ఎలిమినేషన్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. రేపటి ఎపిసోడ్ లో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ని చూపించనున్నారు. ఇది నిజంగా ఊహించని ఎలిమినేషన్ అనే చెప్పాలి. శ్రేష్టి వర్మ మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, మొదటి వారం లో ఆ టాలెంట్ బయటపడకపోయిన, కచ్చితంగా రెండవ వారం నుండి కానీ, లేదా ఆ తర్వాత వారం కానీ, టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా తన టాలెంట్ బయటపడేది.
కానీ బ్యాడ్ లక్..పాపం ఎలిమినేట్ అయిపోయింది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఈమెకు, ఫ్లోరా షైనీ కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ కాస్త ఎక్కువ మార్జిన్ తో ఫ్లోరా షైనీ సేఫ్ అయ్యింది. వాస్తవానికి ఈ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఫ్లోరా నే. ఈమె ఇప్పటి వరకు బిగ్ బాస్ కి ఇచ్చిన కంటెంట్ ఏమి లేదు. పైగా ఈమె టాస్కులు భవిష్యత్తులో బలంగా ఆడుతుంది అనే నమ్మకం కూడా లేదు. ఒకవేళ ఆమెకు తక్కువ మార్జిన్ లో ఎక్కువ ఓటింగ్ వచ్చినప్పటికీ ఆమె వల్ల ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు కాబట్టి ఎలిమినేట్ చేసి శ్రేష్టి వర్మ ని ఉంచాల్సింది అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఫ్లోరా షైనీ కి సంజన తో గొడవ కారణంగా కాస్త కంటెంట్ అయినా వచ్చింది, కానీ శ్రేష్టి వర్మ కి ఎలాంటి కంటెంట్ కూడా రాలేదు.
పాపం ఈ వారం మొత్తం ఇమ్మానుయేల్ తో కలిసి హౌస్ మొత్తం శుభ్రం గా ఉంచేందుకు తనవంతు ప్రయత్నం చాలా గట్టిగానే చేసింది. కానీ తన టాలెంట్ బయటపడేలోపే ఇలాంటి షాక్ తగలడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. పైగా జానీ మాస్టర్ పై కేసు వేసిన ప్రభావం ఈమె పై చాలా బలంగా పడినట్టు తెలుస్తుంది. ఆ నెగటివిటీ కారణంగానే ఈమెకు ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదని అంటున్నారు. అయితే ఈమె ఇప్పుడు టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు కాబట్టి, రెమ్యూనరేషన్ చాలా బలంగానే ఇచ్చారట. ఒక్క వారం ఉన్నందుకు గాను ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ లక్ష 50 వేల రూపాయిలు అట. కనీసం రెండు మూడు వారాలు అయినా ఆమె హౌస్ లో ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.