Teja Sajja Love: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలి అంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు సైతం ఉన్నారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవి లాంటి హీరో సైతం సోలో గా ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక ఆయన బాటలోనే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి నటులు వచ్చారు. ఇక ప్రస్తుతం తేజ సజ్జ సైతం అదే బాటలో నడుస్తుండడం విశేషం… చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన ప్రస్తుతం హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తుండడం విశేషం…పాన్ ఇండియాలో సైతం అతనికి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రేక్షకులు సైతం తేజ సజ్జ సినిమాల కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే తేజ తన చిన్నతనంలోనే ఒకరిని లవ్ చేశారట. కానీ ఆ లవ్ ఫెయిల్యూర్ గా మారడంతో అప్పటినుంచి ఇప్పటివరకు మరోసారి లవ్ జోలికి వెళ్లలేదని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు… ఇంతకీ ఆయన లవ్ చేసింది ఎవర్ని అంటే అప్పట్లో టాప్ హీరోయిన్స్ ఉన్న సోనాలి బింద్రే ని కావడం విశేషం…
తనంటే అప్పట్లో తేజ కి విపరీతమైన ప్రేమ ఉండేదని తనను చాలా గాఢంగా ప్రేమించాను అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే సెలబ్రిటీ క్రష్ అనేది ఆమె మీదనే ఉండేదని తెలియజేయడం విశేషం… ఇక ఆమె ఆ తర్వాత సినిమాలను గుడ్ బై చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సినిమాలు తీయడం మానేసింది.
దాంతో తేజ సజ్జ కూడా చాలా వరకు ఇబ్బందికి గురైనట్టుగా తెలియజేశాడు. ఇక మొత్తానికైతే చాలా ఫన్నీగా ఈ లవ్ స్టోరీ గురించి చెప్పిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు ఇంకెవరిని లవ్ చేయకపోవడం విశేషం… ఇక సోనాలి బింద్రే తో ఆయన పలు సినిమాల్లో కలిసి నటించడం విశేషం…