Teja Sajja Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు తేజ సజ్జ ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ప్రేక్షకుల్లో మాత్రం చెరగని ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘మిరాయి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఈ సినిమా కోసం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే చార్జ్ చేశాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 25 నుంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఈ సినిమాతో ఆయనకు గొప్ప గుర్తింపు అయితే వచ్చింది.
కాబట్టి ఆయన అంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో తప్పేమి లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం. ఇక మిరాయి సినిమా దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఈనెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా రిలీజ్ అవుతోంది.
కాబట్టి అప్పటివరకు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా మిరాయి లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన తేజ సజ్జ తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో చేస్తున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ఇక మొదట కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిరాయి కి సంబంధించిన విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం తను ఎంతలా కష్టపడ్డాడో ఆ విజువల్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతోంది. సినిమా మీద డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాడు కాబట్టి తేజ సజ్జ తప్పకుండా స్టార్ హీరోగా మారతాడు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తుండటం విశేషం…