Prabhas- Anchor Suma: నాటి నుంచి నేటి వరకు తెలుగు యాంకరింగ్ లో నెంబర్ స్టానంలో ఉంటోంది సుమ కనకాల. అలనాడు సిరియల్స్ లో.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించిన ఈమె తనకు సినిమాల కంటే యాంకరింగే బెస్ట్ అని చెప్పి ఈ రంగంలోనే స్థిరపడింది. సుమ యాంకర్ ఫీల్డులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నాయి. ఆమెకు పోటీగా ఎంతో మంది యాంకర్లు వచ్చారు. కానీ సుమను మాత్రం ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ కొన్ని సినీ ఫంక్షన్లో సుమ ఉంటేనే బెటర్ అని కొందరు స్టార్ హీరోలు పేర్కొంటారు కూడా. తాజాగా ఓ సినీ ఫంక్షన్లో పాల్గొన్న సుమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభాస్ తో కలిసి ఓ సినిమాలో నటించానని చెప్పింది. ఇంతకీ ఆ సినిమా ఏదో చూద్దాం.
చోళుల చరిత్ర నేపథ్యంలో ఇటీవల రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 2 మంచి విజయాన్ని సాధించాయి. ఇందులో హీరోయిన్లుగా ఐశ్వర్యరాయ్ తో పాటు త్రిష కూడా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్లో త్రిషతో పాటు సుమ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ‘తాను వర్షం సినిమా చేసినప్పటి నుంచి సుమ కనకాల తెలుసునని, అప్పటి నుంచి మేం బెస్ట్ ఫ్రెండ్స్’ అని చెబుతుంది. అయితే అక్కడే ఉన్న సుమ వెంటనే మైక్ లాక్కొని తాను ప్రభాస్ కు సిస్టర్ గా నటించానని, ఇక త్రిషకు అక్కగా నటించాలని చెప్పింది.
ప్రభాస్-త్రిష కాంబినేషన్లో వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలిసిందే. కథ తో పాటు మ్యూజికల్ గా మంచిసక్సెస్ సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ కు అక్కగా సుమనటించింది. ప్రభాస్ వరంగల్ కు వెళ్లినప్పుడు వాళ్ల అక్క ఇంట్లోనే ఉంటాడు. సుమ ప్రభాస్ కు అక్కగా నటించింది. అయితే సుమను అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఫేమస్ యాంకర్ గా మారారు. దీంతో సుమ తాను నటించిన వర్షం గురించి చెప్పింది.
సుమ యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటించింది. మొదటిసారిగా ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్ చేసింది. అయితే తనకు సినిమాలు కలిసిరాలేదు. దీంతో యాంకర్ గానే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ సినీ ఫంక్షన్ జరిగినా అక్కడ సుమ కచ్చితంగా ఉంటుంది. ఈమె తరువాత పీల్డులోకి వచ్చిన అనసూయ, రష్మీలు యాంకర్ గా ఆకట్టుకున్నారు. కానీ సుమ క్రేజ్ తగ్గకపోవడం విశేషం.