https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున స్టార్ డమ్ వల్ల కూడా కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయా.. అవి ఏ సినిమాలో తెలుసా..?

సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మార్కెట్ ను భారీగా పెంచుకోవడం వల్లే తను కూడా తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

Written By: , Updated On : March 14, 2024 / 04:29 PM IST
Did some movies flop because of Nagarjuna stardom

Did some movies flop because of Nagarjuna stardom

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో నాగార్జున ఒకరు. నాగేశ్వరరావు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నాగార్జున.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ మార్కెట్ ను విస్తరించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక తనతో పాటు సీనియర్ హీరోలైన చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) మార్కెట్ ను భారీగా పెంచుకోవడం వల్లే తను కూడా తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. అయిన కూడా నాగార్జున కి మాత్రం సరైన సక్సెస్ సినిమాలు పడడం లేదు. ఇక రీసెంట్ గా ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ప్లాప్ అయింది. దాంతో నాగార్జున ఇప్పుడు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నాగార్జున చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక వాటితో పాటుగా ఆయనకు భారీ డిజాస్టర్ సినిమాలు కూడా వచ్చాయి.

అయితే ఆయనకు ఉన్న క్రేజ్ వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన విషయం చాలామందికి తెలియదు.
ముఖ్యంగా శివ సినిమాతో ఆయనకు స్టార్ హీరోగా సూపర్ స్టార్ డమ్ అయితే వచ్చింది. ఇక ఆ స్టార్ స్టేటస్ ను అందుకునే విధంగా ఆ తర్వాత సినిమాలు రాకపోవడంతో శివ తర్వాత ఆయనకు కొన్ని ప్లాప్ లు కూడా వచ్చాయి. వాటిలో గోవింద గోవింద, వజ్రం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి… ఇక ఆ తర్వాత కూడా ఆయన చేసిన అన్నమయ్య సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఈ సినిమాతో కూడా ఆయనకు మళ్ళీ మంచి స్టార్ డమ్ ఏర్పడడం ఆయన సినిమాల మీద జనాలు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు రాకపోవడంతో ఆయనకి కొన్ని ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి…ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ను స్టార్ హీరో చేసిన ఘనత మాత్రం రామ్ గోపాల్ వర్మ కి దక్కుతుందనే చెప్పాలి…