Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఎఫైర్స్ వెరీ కామన్. బిగ్ బాస్ సీజన్ 6 లో ఇనయా-ఆర్జే సూర్య ఎఫైర్ హైలెట్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఇనయా ఓపెన్ గా సూర్య అంటే నాకు ఇష్టమని చెప్పింది. అప్పటి నుండి రొమాన్స్ స్టార్ట్ చేశారు. సూర్య మోజులో ఇనయా గేమ్ కూడా వదిలేసే పరిస్థితి వచ్చింది. దీంతో నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చాడు. రిలేషన్స్, ఎమోషన్స్ ఏదైనా ఓకే… అదే సమయంలో గేమ్ కూడా ఆడాలి అన్నారు. నాగార్జున క్లాసు పీకడంతో ఇనయాలో మార్పు వచ్చింది.

ఒకటి రెండు వారాలు డిస్టెన్స్ మైంటైన్ చేద్దామంది. మిగతా వాళ్ళను నమ్మించేందుకు సూర్యను నామినేట్ చేసింది. అనూహ్యంగా ఆ వారం సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇనయా లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. వెంటనే మరో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. శ్రీహాన్-శ్రీసత్య బాగా క్లోజ్ అయ్యారు. అయితే వీరిది రహస్య ప్రేమ. చేసేవన్నీ చేస్తూ ఎవరైనా అడిగితే… కేవలం ఫ్రెండ్స్ అంటారు. ఫ్లోలో ఒకటి రెండు సార్లు రేవంత్ వాళ్ళ ఎఫైర్ పై కామెంట్స్ చేశారు.
అప్పుడు కూడా శ్రీహాన్ డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే బయట నుండి చూస్తున్న జనాలకు అర్థం అవుతుంది కదా. సిరి బాగా హర్ట్ అయినట్లు ఉంది. ఫ్యామిలీ వీక్ లో శ్రీహాన్ కుటుంబ సభ్యులను కాదని తాను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీసత్య పట్ల సిరి తన అసహనం ప్రదర్శించింది. మెత్తగా చురకలు వేసింది. అయితే శ్రీహాన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని నేటి ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చింది.

నాగార్జున 13 వారాల్లో మీరు బాగా బాధపడిన వీక్ ఏదో చెప్పాలని అడిగారు. 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశాను. అది చేయకుండా ఉండాల్సింది. అందుకు నేను చాలా బాధపడ్డాను అని శ్రీసత్య చెప్పింది. నాగార్జున శ్రీహాన్, రేవంత్ విషయంలో ఏం బాధపడలేదా? ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా మార్పులు వచ్చాయనుకుంటా? అని నాగార్జున అడిగాడు. నేను ఇవ్వడం వరకే సార్, తిరిగి ఆశించను అని శ్రీహాన్ ని ఉద్దేశించి చెప్పింది. నాగార్జున ప్రశ్న లోతుగా పరిశీలిస్తే హౌస్లోకి వచ్చిన సిరి లవర్ శ్రీహాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో మనోడు మారిపోయాడని తెలుస్తుంది. అవును శ్రీహాన్ మారాడు, నేను హర్ట్ అయ్యానని శ్రీసత్య చెప్పడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.