Balakrishna- Suresh Babu And Allu Aravind: సినిమా బిజినెస్ ని ఆ నలుగురు శాసిస్తున్నారు. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో జరుగుతున్న అతిపెద్ద డిబేట్ ఇది. థియేటర్స్ తమ చేతిలో ఉంచుకొని ఆ నలుగురు వ్యక్తులు పరిశ్రమను కంట్రోల్ చేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒక సినిమా విడుదల కావాలంటే వాళ్ళ అనుమతి ఉండాలి. వాళ్ళ ఇష్టప్రకారమే నడవాలి. లేదంటే హిట్ సినిమాను కూడా తొక్కిపడేసే దమ్ము వాళ్ళకుంది. పెద్ద హీరోలు ఏదో ఒక విధంగా లాలూచీపడి సర్వైవ్ అవుతున్నారు. చిన్న హీరోలు, చిత్రాల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందనే వాదన ఉంది.

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న సురేష్ బాబు, అల్లు అరవింద్ ఆ నలుగురిలో ఇద్దరం మేము, మరో ఇద్దరు దిల్ రాజు, ఏషియన్ సునీల్ అని ఓపెన్ గా చెప్పేశారు. తమ చేతుల్లో థియేటర్స్ ఉన్నాయని ఒప్పుకున్న వీరిద్దరూ… తెలుగు సినిమా చావకుండా బ్రతికించాము అన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో వస్తున్న మార్పులు థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిస్తూ వచ్చాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 3000 పైగా థియేటర్స్ ఉండేవి. అవి ఇప్పుడు 1700 పడిపోయాయి.
డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా థియేటర్స్ ఆధీనంలో పెట్టుకోవడానికి కారణమైందని సురేష్ బాబు అన్నారు. థియేటర్ ఓనర్స్ వాటిని మైంటైన్ చేయలేకపోతుంటే వాళ్ళ దగ్గర మేము తీసుకొని కోట్లు ఖర్చుపెట్టి ఆధునీకరించారు. లేడీ టాయిలెట్స్ నుండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం స్టార్ట్ చేశారు. మేము థియేటర్స్ తీసుకొని పరిశ్రమను కంట్రోల్ చేయడం లేదు. తెలుగు సినిమాను బ్రతికించాము. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య అధికంగా ఉందని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.

అవకతవకలు ఉన్నాయి. విమర్శలు వస్తున్నాయి. నా సినిమా విడుదల చేసుకోవడానికి థియేటర్స్ దొరకలేదు. అప్పుడు ఈ వ్యవస్థలోకి వచ్చానని సురేష్ బాబు అన్నారు. అయితే నా సంక్రాంతి సినిమా వీరసింహారెడ్డికి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారని బాలయ్య అడిగారు. అది డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య అవగాహన, ఒప్పందం పై ఆధారపడి ఉంటుందని సురేష్ బాబు కుండబద్దలు కొట్టారు. బాలయ్య లాంటి స్టార్ హీరో థియేటర్స్ కోసం అర్థించుకోవాల్సి రావడమంటే అర్థం చేసుకోవచ్చు, పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో.