RGV and Ravi Teja: ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja). అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, హీరో గా మారి హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోల లీగ్ లోకి దూసుకొచ్చిన నటుడు ఆయన. మిరపకాయ్ చిత్రం వరకు రవితేజ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలతో సమానమైన మార్కెట్ రవితేజ కి కూడా ఉండేది. వాళ్ళతో సమానంగా రెమ్యూనరేషన్ కూడా తీసుకునేవాడు. కానీ మిరపకాయ్ తర్వాత రవితేజ చేసిన సినిమాలు ఆయన స్టార్ హీరోల లీగ్ నుండి తప్పించేలా చేశాయి. ఒకానొక సమయం లో ఆయన కెరీర్ రిస్క్ లో పడే పరిస్థితి కూడా ఏర్పడింది.
అయితే రవితేజ కి ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం రామ్ గోపాల్ వర్మ అని ఆయన అభిమానులు అంటున్నారు. ‘మిరపకాయ్’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రవితేజ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో ‘దొంగలముఠా’ అనే చిత్రం చేసాడు. ఆరోజుల్లో కేవలం నాలుగు రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రమిది. దేశం లోనే అరుదైన రికార్డు. అలా మంచి హైప్ తో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడి నుండే రవితేజ మార్కెట్ కి గండి పడడం మొదలైంది అని అంటున్నారు విశ్లేషకులు. రామ్ గోపాల్ వర్మ హ్యాండ్ మామూలుది కాదని, ఆ హ్యాండ్ మంచి స్థాయి లో ఉన్న రవితేజ వంటి వాడిని కూడా క్రిందకి నెట్టేసిందని అంటున్నారు. ‘దొంగలముఠా’ తర్వాత రవితేజ కి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ స్టార్ హీరో స్టేటస్ ని మళ్లీ వెనక్కి రప్పించలేకపోయాయి.
రవితేజ కి జరిగినట్టే అంతకు ముందు అక్కినేని నాగార్జున విషయం లో కూడా జరిగింది. సీనియర్ హీరోలలో మంచి మార్కెట్ తో కొనసాగుతూ వస్తున్న నాగార్జున, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో ‘ఆఫీసర్’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా కి జీరో షేర్ రావడం, ఆ తర్వాత నాగార్జున కెరీర్ లో అలాంటి సినిమాలు వరుసగా రావడం తో, ఆయన తన మార్కెట్ ని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా పీక్ స్థానం లో ఉన్న సమయం లో వీళ్లిద్దరు రామ్ గోపాల్ వర్మ ని ముట్టుకొని మూర్ఛపోయారు. మళ్లీ వీళ్లిద్దరికీ పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో చూడాలి. నాగార్జున అయితే క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు, కానీ రవితేజ ఇంకా హీరో గానే కొనసాగుతున్నాడు. ఆయన కాంబినేషన్ లిస్ట్ కూడా బాగానే ఉంది.