Trolling on Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ప్రతిపక్ష మహా ఘట్ బంధన్ ఊహించిన విధంగా గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈసారి బీహార్ లో జరిగిన ఎన్నికల్లో అనేక చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ప్రశాంత్ కిషోర్ పెట్టిన జన్ సురాజ్ పార్టీ.
కేంద్రంలో ఉన్న బిజెపి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి వరకు రాజకీయ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సేవలు అందించారు. దీనికోసం భారీగానే ఫీజు వసూలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి ప్రశాంత్ కిషోర్ కు కోట్లకు కోట్లు ముట్ట చెప్పాయి. అంతేకాదు అతనితో పని చేయించుకోవడమే దైవ నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించాయి. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా సందర్భాలలో ఫెయిల్ అయ్యాయి. దీనికి తోడు తన సహచరులు రాబిన్ సింగ్, సునీల్ కనుగోలు వ్యూహాత్మకంగా తెరపైకి రావడంతో ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది. దీంతో అతడు ఇక రాజకీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. బీహార్ ఎన్నికల్లో జన్ సూరజ్ పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు.
ఈయన పార్టీ బీహార్ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేయలేదు. కొన్ని స్థానాలలో పోటీ చేసినప్పటికీ 0 ఫలితం వచ్చింది. వాస్తవానికి ఓవర్ హైప్ సృష్టించుకోవడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. పైగా బీహార్ ఎన్నికల్లో అతడు విపరీతంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫలితాలలో హంగ్ కనుక వస్తే తాను చక్రం తిప్పాలని అనుకున్నాడు. చక్రాలు కాదు కదా.. కనీసం బొంగరాలు కూడా దిక్కు లేకుండా పోయాయి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అడ్డంగా ఫెయిల్ కావడంతో నేషనల్ మీడియాలో అతని మీద కథనాల మీద కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇండియా టుడే లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసే రాజ్ దీప్ సర్దేశాయి ప్రశాంత్ కిషోర్ ను విపరీతంగా ట్రోల్ చేశాడు. ప్రశాంత్ కిషోర్ కు మిగిలింది ఇది అంటూ 0 సంకేతాన్ని ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనాలను సృష్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రకరకాల వ్యాఖ్యలు చేశాడు. తాను బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానని ప్రచారం చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తాను కీలకపాత్ర పోషిస్తానని కలలు కన్నాడు. కాని చివరికి బొక్కా బోర్లా పడ్డాడు.
VIDEO OF THE DAY!
RAJDEEP TROLLING PRASHANT KISHOR! pic.twitter.com/uzhhfRow2t
— BALA (@erbmjha) November 14, 2025