https://oktelugu.com/

Ramya Krishnan: రమ్యకృష్ణ, కృష్ణ వంశీ దూరంగా ఉంటున్నారా? వీరి మధ్య గొడవలు జరిగాయా?

రమ్యకృష్ణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ పాత్రలు పోషించే మెయిన్ క్యారెక్టర్ గా తన ప్రస్థానాన్ని సినీ ఇండస్ట్రీలో కొనసాగిస్తుంది రమ్యకృష్ణ.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 20, 2024 1:43 pm
    Ramya Krishnan

    Ramya Krishnan

    Follow us on

    Ramya Krishnan: ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొన్ని సంవత్సరాలు కొనసాగడం ఈజీనే. కానీ హీరోయిన్ లు మాత్రం సంవత్సరాల పాటు ఉండాలంటే కష్టమైన పనే అని చెప్పాలి. సక్సెస్ వస్తే స్టార్ గా కొనసాగుతారు. లేదంటే వాళ్లను ఇండస్ట్రీలో పట్టించుకునే వారు కూడా ఉండరు. అందువల్ల హీరోయిన్ ల సినీ కెరీర్ చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ కొందరు మాత్రం హీరోయిన్ లు గా కొనసాగి ఆ తర్వాత మెయిన్ లీడ్ పాత్రల్లో కొనసాగుతుంటారు. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే వారు కూడా ఉన్నారు.

    ఈ లిస్ట్ లో ముఖ్యంగా రమ్యకృష్ణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ పాత్రలు పోషించే మెయిన్ క్యారెక్టర్ గా తన ప్రస్థానాన్ని సినీ ఇండస్ట్రీలో కొనసాగిస్తుంది రమ్యకృష్ణ. ఈమె హీరోయిన్ గా ఏకంగా 15 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇప్పుడు తల్లి, అత్త పాత్రలు చేస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటుంది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ఈమె చేసిన శివగామి పాత్ర నెక్స్ట్ లెవల్ అంటూ కామెంట్లు వచ్చాయి.

    ఒక తెలుగులో మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తుంది రమ్య. అయితే ఈమె హీరోయిన్ గా ఉన్నప్పుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మరి ప్రస్తుతం వీరు కలిసి ఉంటున్నారా? లేదా విడివిడిగా ఉంటున్నారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

    కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటే రమ్యకృష్ణ చెన్నైలో ఒంటరిగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేదంటే కెరీర్ పరంగా దూరంగా ఉంటున్నారా? అనే విషయాలపై క్లారిటీ లేదు. మరి కొన్ని ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ అసలు వాస్తవం బయటకు రాదు. మరి చూడాలి ఈ వార్తలపై ఎప్పుడు స్పందిస్తారో..