Bigg Boss Telugu 8 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. కానీ విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేస్తే రెండు భారీ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అలా కాకుండా డిసెంబర్ 25 న చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. ఈ రెండు తేదీలు కాకుండా సంక్రాంతికి కూడా విడుదల చేసే ప్లాన్ కూడా ఉందట. ప్రస్తుతం ఆయన ‘గేమ్ చేంజర్’ చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 వ తేదికి మార్చి ‘గేమ్ చేంజర్’ ని సంక్రాంతికి వేసే ప్లాన్ లో ఉన్నారట. ఒకవేళ ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి విడుదల అయితే ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసారు. మొదటి పాట ‘జరగండి..జరగండి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. టీవీ షోస్ లో కూడా ఈ పాటను ఈమధ్య తెగ వాడేస్తున్నారు. అలాగే వారం రోజుల క్రితం విడుదలైన ‘రా మచ్చ మచ్చ’ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈమధ్య కాలం లో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ వచ్చిన పాటలన్నీ ఇంస్టాగ్రామ్ రీల్స్ కారణంగానే అని చెప్పొచ్చు. నెటిజెన్స్ కి అనువుగా ఉండే స్టెప్పులు ఉన్న పాటలకు రీల్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం ఈమధ్య ఒక ట్రెండ్ గా మారిపోయింది. అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం లోని పాటలు కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అయ్యేందుకు ఆ మూవీ టీం ప్రోమోషన్స్ వేరే లెవెల్ లో చేస్తుంది.
ఇంస్టాగ్రామ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సెలెబ్రిటీలను ఎంచుకొని వాళ్ళ చేత రీల్స్ చేయిస్తున్నారు. వారిలో రీసెంట్ గానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన మెహబూబ్ కూడా ఉన్నాడు. ఒక్కో రీల్ కి 20 వేల రూపాయిలు ఇస్తున్నట్టు సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. మెహబూబ్ తో పాటుగా అమర్ దీప్, మరియు ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కూడా రీల్స్ చేయిస్తున్నారట. కానీ అనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు. సాంగ్ లో స్టెప్పులకు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసే నెటిజెన్స్ అంతగా ఆకర్షితులు అయ్యినట్టు లేదని విశ్లేషకులు చెప్తున్నారు. దసరా కానుకగా గేమ్ చేంజర్ నుండి టీజర్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందట మూవీ టీం, దీనికి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.