https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ఎందుకు డ్రామాలు ఆడుతున్నావ్’ అంటూ మణికంఠ కి అదిరిపోయే రేంజ్ లో కౌంటర్లు విసిరిన గంగవ్వ..వైరల్ అవుతున్న వీడియో!

నిన్న హౌస్ లోకి ఆమె అడుగుపెట్టి, మొదటి టాస్కు ఆడిన తీరుని చూస్తే కుర్రోళ్ళ కంటే ఈమె బెటర్ అని అనిపించింది. కేవలం టాస్కులు ఆడడం మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా అదరగొట్టేస్తుంది. ఈమె యాసకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 10:57 am
    Bigg Boss Telugu 8(93)

    Bigg Boss Telugu 8(93)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా అలరించిన ‘గంగవ్వ’ ఆ తర్వాత బిగ్ బాస్ వాతావరణం పడకపోవడంతో మంచి ఓటింగ్ ఉన్నప్పటికీ 5వ వారం నాగార్జున ని రిక్వెస్ట్ చేసి బయటకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆమె సీజన్ 8 లోకి అడుగుపెట్టింది. మళ్ళీ ఈమె ఎందుకు వచ్చింది?, అక్కడ అందరూ కుర్ర కంటెస్టెంట్స్ ఉన్నారు, టాస్కులు చాలా బలంగా ఉంటాయి,ముసలావిడ తట్టుకోలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసేవారు. కానీ నిన్న హౌస్ లోకి ఆమె అడుగుపెట్టి, మొదటి టాస్కు ఆడిన తీరుని చూస్తే కుర్రోళ్ళ కంటే ఈమె బెటర్ అని అనిపించింది. కేవలం టాస్కులు ఆడడం మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా అదరగొట్టేస్తుంది. ఈమె యాసకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.

    ఆ యాసతో నేడు ఈమె మణికంఠ మీద వేసిన పంచులు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ముందు గా ఆమె మాట్లాడుతూ ‘భార్య, కూతురు గుర్తొస్తుంది అని ఏడుస్తావ్..వెళ్లొచ్చు కదా అక్కడికే, ఇక్కడికి ఎందుకు వచ్చావ్?’ అని అడుగుతుంది. అప్పుడు మణికంఠ మాట్లాడుతూ ‘ఎంత ముద్దుగా అడిగినావే’ అని దగ్గరకు వస్తాడు. అప్పుడు గంగవ్వ ‘అది నేను టీవీ లో చూసినా’ అని అంటుండు. అప్పుడు మణికంఠ ‘ తట్టుకోలేను గంగవ్వా నాకు ఏమొచ్చినా..నేను ఇంతే’ అని అంటాడు. ‘తట్టుకోలేవా..పోతావా ఈవారం నామినేషన్ వేస్తాను’ అని అంటుంది గంగవ్వ. ఆమ్మో నేను వెళ్ళను నాకు పైసలు కావాలి అని అంటాడు మణికంఠ. దానికి గంగవ్వ సమాధానం చెప్తూ ‘పైసలు కావాలంటే అన్ని తట్టుకోవాలి’ అని అంటుంది. ‘ఇక నేను మార్చుకుంటే గంగవ్వా ,ఏడవను..ఏడిస్తే నన్ను నామినేషన్స్ లో వేసేయ్’ అని అంటాడు మణికంఠ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీ గా అనిపించింది.

    మరో విశేషం ఏమిటంటే మణికంఠ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి తొలుత బాగా భయపడేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇతనిలో బాగా మార్పులు వచ్చాయి. ఏడవడం బాగా తగ్గించేసాడు, ఎమోషనల్ డ్రామా కూడా తగ్గింది, సరదాగా అందరితో కలిసిపోయి జోకులు వేస్తున్నాడు. ఇలాగే మణికంఠ తన ఆటను కొనసాగిస్తే కచ్చితంగా ఆయన టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుంది. కంటెస్టెంట్స్ కూడా మణికంఠ కి సానుభూతి యాంగిల్ ఇవ్వకూడదు అని చాలా తెలివిగా ఆడుతున్నారు. మొదటి వారం నుండి ఐదవ వారం వరకు నామినేషన్స్ లోకి వరుసగా వచ్చిన మణికంఠ, ఈ వారం నామినేషన్స్ లోకి మాత్రం రాలేదు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా బయట పరిస్థితులను గమనించి మణికంఠ కి మైలేజ్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక నుండి మణికంఠ సింపతీ డ్రామాలతో కాకుండా, సొంతంగా గేమ్స్ ఆడి ప్రేక్షాభిమానం పొందాల్సి ఉంటుంది. మరి ఆయన ఆ దిశగా అడుగులు వేస్తాడా లేదా అనేది చూడాలి.