
Rakul Preet Singh : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.కెరటం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలిసారిగా కెరీర్ లో భారీ కమర్షియల్ హిట్ ని అందుకుంది.ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజీ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది.
ఈమధ్య కాలం లో ఈమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం, కుర్ర హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం తో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.కానీ హిందీ లో మాత్రం అవకాశాలు బాగా వచ్చాయి.కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ తో తాను ఇండస్ట్రీ లోకి అడుపెట్టకముందు ఎలాంటి కష్టాలను ఎదురుకుందో చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీ లో అవకాశాలు సంపాదించేందుకు చాలా కష్టపడ్డాను అని, తాను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మనిషిని అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.ఆరోజుల్లో సినిమాల్లో ఒక్క అవకాశం సంపాదించుకునేందుకు రోజుకి పదికి పైగా ఆడిషన్స్ ఇచ్చేదానిని అని, బట్టలు మార్చుకోడానికి సరైన స్థలం కూడా దొరికేది కాదని, కారులోనే బట్టలు మార్చుకునేదానిని అంటూ చెప్పుకొచ్చింది.అంతే కాకుండా ఈమెకి కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవమానాలు కూడా ఎదురయ్యాయి అట.ఒక సూపర్ హిట్ సినిమాలో ముందుగా ఈమెకి హీరోయిన్ అవకాశం ఇచ్చి, నాలుగు రోజుల పాటు షూటింగ్ ని జరిపి, ఆ తర్వాత నాకంటే స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించడం బెటర్ అని భావించి ఆమెని ఆ సినిమా నుండి తీసేశారట.అలా కెరీర్ లో ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థానం లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
ఈమె ఆడిషన్స్ కి వెళ్తున్న స్పాట్ లో వందల మంది క్యూలో ఆడిషన్స్ కోసం నిల్చునేవారట, వాళ్ళతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా గంటలతరబడి క్యూ లైన్స్ లో నిల్చునే దానిని అని, ఇండస్ట్రీ లో ఆ స్థాయిలో కష్టపడితే కానీ సక్సెస్ రాదు అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.ఆమె మాటలు విన్న తర్వాత పాపం రకుల్ ఇంతకష్టపడి పైకి వచ్చిందా అని జాలి పడుతున్నారు అభిమానులు.