Prashant Neel : సినిమా ఇండస్ట్రీ ఒక జూదం లాంటిది. ఇక్కడ హిట్లు ప్లాపులు అనేవి కామన్… ఒకసారి సక్సెస్ వచ్చినంత మాత్రాన ఎప్పటికీ సక్సెస్ వస్తుందనే నమ్మకం లేదు. ఒకసారి ఫెయిల్యూర్ మూటగట్టుకున్నంత మాత్రాన అతను ఎప్పుడు ఫెయిల్యూర్ సినిమాలనే చేస్తాడని కాదు. దర్శకులు ఎంచుకున్న కథలు ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగితే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది…
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎవరికి వారు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక్కడ ఏ కొంచెం నిర్లక్ష్యం వహించినా కూడా మనకంటే వెనక ఉన్నవారు మనల్ని తొక్కేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే ఇక్కడ నిలకడగా నిలబడగలుగుతాం అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ‘హనుమాన్’ సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఆయన మరిన్ని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ‘దేవకీ నందన వసుదేవ’ అనే సినిమాకి ప్రశాంత్ వర్మ కథను అందించాడు. ఇక మహేష్ బాబు మేనల్లుడు ఆయన అశోక్ గల్లా ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. దాంతో ప్రశాంత్ వర్మ పేరు భారీగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆయనకు భారీ గుర్తింపు అయితే వచ్చింది. ఇక మొత్తానికైతే ఈ ఇయర్ ఎండింగ్ లో దేవకీ నందన వసుదేవ సినిమాకి కథను అందించి భారీగా డ్యామేజ్ ను మూటగట్టుకున్నాడనే చెప్పాలి…
ఇక కే జి ఎఫ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు ప్రశాంత నీల్…కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ఈయన మాస్ సినిమాలు చేయడంలో దిట్ట…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని కూడా షేక్ చేశాడనే చెప్పాలి. దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియాలో భారీ గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ భఘీర అనే సినిమాకి కథను అందించాడు. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రశాంత్ నీల్ పేరు బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా వాళ్ల సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తేనే వాళ్లకు భారీ గుర్తింపైతే వస్తుంది. అలా కాకుండా ఇతర సినిమాలకు కథలను అందించడం లాంటివి చేస్తే మాత్రం వాళ్ళ ఇమేజ్ అనేది రోజురోజుకీ డ్యామేజ్ అవుతుందనే చెప్పాలి…