https://oktelugu.com/

Allu Arjun : అభిమానుల కోసం అల్లు అర్జున్ స్టేజి మీద స్టెప్పులు వేస్తున్న సమయంలో వింత సంఘటన..వైరల్ అవుతున్న వీడియో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' మూవీ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ప్రతీ ప్రాంతంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 10:52 AM IST
    A strange incident happened while Allu Arjun was taking steps on the stage for his fans..The video is going viral!

    A strange incident happened while Allu Arjun was taking steps on the stage for his fans..The video is going viral!

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ప్రతీ ప్రాంతంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. మరో పక్క సమాంతరంగా ప్రమోషన్ ఈవెంట్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. నిన్న చెన్నై లో ‘వైల్డ్ ఫైర్’ అని ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మధ్యలో దేవి శ్రీప్రసాద్ నిర్మాతలపై కాస్త అసహనం ని వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత జరిగిన సంఘటనలు అభిమానులకు ఒక రేంజ్ కిక్ ని ఇచ్చింది. అల్లు అర్జున్ కి చెన్నై లో ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని, ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ ఉందనే విషయం నిన్న ఈవెంట్ ని చూసినప్పుడు అనిపించింది.

    స్టేజి మీద అల్లు అర్జున్ ఉన్నంత సేపు ఎంతో ఎనర్జీ కనిపించింది. యాంకర్స్ కోరిక మేరకు ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యానరిజమ్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. అదే విధంగా ఆయన అభిమానుల కోసం ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ కి స్టేజి మీద డ్యాన్స్ వేయడం కూడా ఫ్యాన్స్ కి మామూలు కిక్ ఇవ్వలేదు. అయితే అల్లు అర్జున్ స్టెప్పులు వేస్తున్న సమయంలో ఆయన కాళ్లకు వేసుకున్న బూటు జారీ క్రింద పడిపోతుంది. దానిని అల్లు అర్జున్ మళ్ళీ సరి చేసుకుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదే విధంగా తమిళ ఆడియన్స్ ని ఉద్దేశిస్తూ ఆయన ఇచ్చిన ప్రసంగం కూడా వైరల్ అయ్యింది. చూడాలి మరి ఈ చిత్రం తమిళ ఆడియన్స్ ని ఎంత వరకు అలరిస్తుంది అనేది.

    ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 1’ అప్పట్లో తమిళనాడు లో పెద్ద హిట్ అయ్యింది. దేశం మొత్తం పుష్ప మేనియా తో ఎలా అయితే ఊగిపోయిందో, తమిళనాడు కూడా అలాగే ఊగిపోయింది. తమిళం లో ఒక తెలుగు సినిమా హిట్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా అదృష్టం ఉండాలి. అల్లు అర్జున్ కి అది ఉంది, తమిళం లో ఈ సినిమా ద్వారా ఆయన ఏర్పర్చుకున్న క్రేజ్ కూడా మామూలుది కాదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘పుష్ప 2’ చిత్రానికి తమిళనాడు మొత్తం షేక్ అయ్యే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వస్తాయని, టాక్ వస్తే ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం తమిళనాడు ప్రాంతం నుండి వస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. విడుదల కూడా రజినీకాంత్, అజిత్, విజయ్ సినిమాల రేంజ్ లో ఉండబోతుంది.