https://oktelugu.com/

Tollywood Industry : నవంబర్ నెలలో ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ముందుగా తెలుగులో భారీ సక్సెస్ లను సాధిస్తేనే ఆ తర్వాత వాళ్లకి పాన్ ఇండియాలో కూడా మార్కెట్ ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో మొదట తెలుగు సినిమాలను నమ్ముకొని ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 1, 2024 / 07:50 PM IST

    Telugu film industry in the month of November

    Follow us on

    Tollywood Industry : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. మంచి సబ్జెక్ట్ లను సినిమాలుగా ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరోలు వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తుంటే, మరికొందరు మాత్రం ఫ్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది…ఇక ఇదిలా ఉంటే నవంబర్ నెలలో వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షకులేవరిని సినిమా థియేటర్ వైపు వెళ్లకుండా చేసిందనే చెప్పాలి. ఇక మెగా ప్రిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత వారంలో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖీ’ అంటూ హడావిడి చేసినప్పటికి అది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. అలాగే మహేష్ బాబు మేనల్లుడు ఆయన అశోక్ గల్లా హీరోగా ప్రశాంత్ వర్మ కథను అందించిన ‘దేవికి నందన వసుదేవ’ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాలతో పాటుగా సత్యదేవ్ హీరోగా వచ్చిన జీబ్రా సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.

    ఇక దీంతోపాటు రోటీ కపడా రొమాన్స్ అనే పేరుతో ఒక చిన్న సినిమా అయితే వచ్చింది. ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో నవంబర్ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ కూడా నమోదు కాలేదనే విషయం ఇప్పుడు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే జీబ్రా సినిమా సత్యదేవ్ కెరియర్ లో కొంతవరకు ఆయనకు హెల్ప్ అయిందనే చెప్పాలి. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు… ఇక ఏది ఏమైనా కూడా ఒక నెలలో ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 5వ తేదీన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…

    ఇక నవంబర్ లో మిస్సయిన సక్సెస్ ల పరంపర డిసెంబర్ నెలలో కొనసాగాలని అలాగే ఈ సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతోనే పుష్ప 2 సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఈ నెలలో బరిలోకి దిగుతున్నాయి…