Rohit Sharma : రితిక ప్రసవించిన తర్వాత తనకు మగ బిడ్డ పుట్టాడని రోహిత్ శర్మ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇంతవరకు తన కుమారుడికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు విడుదల చేయలేదు. తన కుమారుడికి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇంతవరకు చెప్పలేదు. దీంతో రోహిత్ అభిమానులు తమ అభిమాన ఆటగాడి కుమారుడు ఎలా ఉంటాడు? అతడు ఎవరి పోలికతో పుట్టాడు? అనే వాటి గురించి తెగ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇటీవల “గూగుల్ లో రోహిత్ కుమారుడు ఎలా ఉంటాడు” అనే అంశంపై తెగ శోధించారట. అయితే తన అభిమానులను దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ ఎట్టకేలకు తన కుమారుడికి సంబంధించిన అప్డేట్ విడుదల చేశాడు. అతడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ తన కుమారుడికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. దీంతో సోషల్ మీడియా మొత్తం ఉదయం నుంచి షేక్ అవుతోంది. రోహిత్ కుమార్ కుమారిడి నామస్మరణ చేస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? దాని వెనుక అర్థమేంటి? రోహిత్ అలాంటి పేరు ఎందుకు పెట్టాడు? అనే విషయాలపై ఆసక్తికర కథనం ఇది.
రోహిత్ కుమారుడి పేరు ఏంటంటే..
రోహిత్ తన కుమారుడి పేరు అహాన్ శర్మ అని పెట్టాడు. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ” క్రిస్మస్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ వేడుకలు ప్రారంభమయ్యాయని” రితిక వెల్లడించింది. అయితే రితిక చేసిన పోస్టులో నాలుగు శాంతా క్లాజ్ లున్నాయి. వాటిలో మూడింటికి రోహిత్, రితిక, సమైరా అనే పేర్లు పెట్టగా.. చివరి దానికి అహాన్ అనే పేరు పెట్టింది. అయితే తన కుమారుడి పేరు నేరుగా చెప్పకుండా క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోను రితిక వెల్లడించడం విశేషం. రోహిత్ – రితిక తమ కొడుకుకి అహాన్ అని పేరు పెట్టడంతో.. చాలామంది అభిమానులు ఆ పేరుకు అర్థం ఏమిటి? ఆ పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? దానికి రిఫరెన్స్ ఏమైనా ఉందా? అనే విషయాలను గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. అహాన్ అనే పేరుకు ప్రాత: కాలపు వెలుగు, ఉషా కిరణం, ఆశా కిరణం, సూర్యుడు ఉదయించే సమయం అనే అర్థాలు ఉన్నాయట. తన కుమారుడికి ప్రకృతితో సంబంధమైన పేరు పెట్టాలని నిర్ణయించుకుని.. అహాన్ అని నామకరణం చేశారని రోహిత్ అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం రోహిత్ అడిలైడ్ మ్యాచ్ కు రెడీ అవుతున్నాడు. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ విధానం నిర్వహిస్తారు. రెడ్ బాల్ కాకుండా పింక్ బాల్ తో ఈ టెస్ట్ ఆడతారు. తొలి టెస్ట్ లో భారీగా పరుగులు సాధించిన ఓపెనింగ్ జోడి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్లో కూడా ఓపెనింగ్ గా బరిలోకి దిగుతారు. కెప్ట్ రోహిత్ శర్మ విరాట్ తర్వాత బ్యాటింగ్ చేస్తాడు. మొత్తంగా చూస్తే అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. కాగా రోహిత్ తన కుమారుడి పేరు అహాన్ అని వెల్లడించడంతో అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అతడి పేరును ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు.
మారుమోగుతున్న సోషల్ మీడియా
అహాన్ పేరుతో సోషల్ మీడియా మారుమోగిపోతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ట్రెండ్స్..ఇలా ఏ ప్లాట్ ఫారం చూసినా అహాన్ పేరు వినిపిస్తోంది. రితిక చేసిన సోషల్ మీడియా పోస్ట్ తెగ దర్శనమిస్తోంది. తన కుమారుడు భూమ్మీదకి వచ్చిన కొద్ది రోజులకే ఇంతటి స్టార్ డం తెచ్చుకోవడంతో రోహిత్ దంపతులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.