Jr. NTR : ఇక మీదట ఎన్టీయార్ సినిమాలని నందమూరి అభిమానులు ఆదరించారా..?

ఇక రాబోయే సినిమాతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ అభిమానులకు గాని ,అటు టిడిపి కార్యకర్తలకు గాని దగ్గరవుతాడా లేదంటే ఆయన సినిమాని వాళ్ళు రిజక్ట్ చేస్తారా ? ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే...

Written By: NARESH, Updated On : January 29, 2024 3:58 pm

Jr. NTR

Follow us on

Jr. NTR : అయితే గత కొద్ది రోజులుగా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య పడడం లేదనే విషయం చాలావరకు అర్థమవుతుంది. వీళ్ళ మధ్య గొడవలు ఏం జరిగాయో తెలియదు గానీ బాలయ్య బాబు, చంద్రబాబు మాత్రం ఆయన్ని ఎన్టీయార్ ని ఎక్కువగా పట్టించుకోవడం లేదు.

ఇక అందులో భాగంగా ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. మొన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలను బాలయ్య బాబు తొలగించాడు. ఇక అందులో భాగంగానే ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ హీరో అయినప్పటికీ, ఎన్టీయార్ ని వాళ్ళ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ ని నందమూరి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ మొత్తం బాలయ్య బాబు సైడ్ ఉంటే, ఎన్టీయార్ కళ్యాణ్ రామ్ మాత్రం సపరేట్ గా ఉంటున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కి ఇన్ని రోజుల నుంచి ఇటు నందమూరి ఫ్యామిలీ అభిమానులు, అటు టిడిపి పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేసుకుంటూ ఆయన సినిమాలను ఆదరిస్తూ వచ్చారు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళందరూ ఇప్పుడు ఎన్టీయార్ సినిమాలను చూసే అవకాశం ఉందా అంటే కొంతవరకు లేదనే అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి. ఇక ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం టిడిపి కార్యకర్తలు ఎన్టీఆర్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని అందుకోవడంలో ఎంతవరకు విజయం సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నందమూరి అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఎన్టీఆర్ ని మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు.

ఇప్పుడు వాళ్ల నుంచి వైరాగ్యం ఎదురవడం అనేది ఎన్టీఆర్ కి పెద్ద దెబ్బగా మారే అవకాశం అయితే ఉంది. దేవర సినిమా విషయంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రాబోయే సినిమాతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ అభిమానులకు గాని ,అటు టిడిపి కార్యకర్తలకు గాని దగ్గరవుతాడా లేదంటే ఆయన సినిమాని వాళ్ళు రిజక్ట్ చేస్తారా ? ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే…