Mahesh Babu: ఆ డైరెక్టర్ తో మహేష్ బాబు టిట్ ఫర్ టాట్ చేశారా?

రాజకుమారుడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నా కూడా.. ఆ తర్వాత సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.

Written By: Swathi Chilukuri, Updated On : February 7, 2024 12:52 pm
Follow us on

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలాంటి స్టేటస్ ను సొంతం చేసుకుంటారో తెలుసుకోవడం కష్టమే. అందుకే ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఈ రోజు స్టార్ స్టేటస్ ను అనుభవించే వారికి రేపు అవకాశాలు ఉండకపోవచ్చు. అదే ఇవాళ ఖాళీగా ఉన్నవారు రేపు స్టార్లు కావచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక రంగులప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. అందుకే ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు ఆచితూచి మాట్లాడుతుంటారు. మెదులుతుంటారు. కానీ కొందరు మాత్రం తోచింది చేస్తుంటారు.

అయితే రాజకుమారుడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నా కూడా.. ఆ తర్వాత సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ తో మహేష్ బాబు ఒక సినిమా చేయాలి అనుకున్నారు. ఇందులో భాగంగా ఆయనను కలిసి ఒక సినిమా చేద్దామా అని అడిగారట. కానీ దీనికి సమాధానంగా నేను చాలా బిజీగా ఉన్నాను. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాను.. నీతో సినిమా చేయడం కష్టం అని చెప్పారట.

ఆ డైరెక్టర్ అలా అనడంతో చాలా బాధ పడ్డారట మిల్క్ స్టార్. అయితే ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ కృష్ణ కూడా డైరెక్టర్ సురేష్ ను అడిగారట. కానీ ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడం చాలా కష్టం అని తేల్చి చెప్పారట సురేష్. దీంతో ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేశారు. వీరి కాంబోలో వచ్చిన నాని సినిమా కూడా భారీ ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అతడు, పోకిరి వంటి సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచి మహేష్ ఖాతాలో హిట్లు ఎక్కువ ఫ్లాప్ లు తక్కువ.

ఇక ఒకసారి డైరెక్టర్ సురేష్ కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నించగా ఇప్పుడు కష్టం అన్నారట మహేష్ బాబు. దీంతో అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి విషయాలు సినిమా ఇండస్ట్రీలో సర్వసాధరణంగా జరుగుతూనే ఉంటాయి. వీటి మీద సిని పెద్దలు కూడా స్పందిస్తుంటారు. అందుకే కొన్ని సార్లు ఎవరిని చిన్న చూపు చూడకూడదు అంటారు. మొత్తం మీద మహేష్ బాబు టిట్ ఫర్ టాట్ చేశారా? లేదా నిజంగానే ఆయనకు సినిమా చేసే సమయం లేదా అనే విషయం తెలియదు.